ప్రజాస్వామ్యం, మీడియా స్వేచ్చ, విలువల గురించి చంద్రబాబునాయుడే చెప్పాలి. ఎందుకంటే తన హయాంలో వాటిని పూర్తిగా హరించిన వ్యక్తి కాబట్టి వాటి విలువలు చంద్రబాబుకే ఎక్కువగా తెలుస్తుంది.  కొన్ని ప్రాంతాల్లో  ఏబిఎన్ ప్రసారాలను మంత్రులు ఆపించేశారట. ఎంఎస్వోలతో ముగ్గురు మంత్రులు భేటి అయి ఏబిఎన్ ప్రసారాలను నిలిపేయకపోతే  ఇబ్బంది పడతారని బెదిరించటంతోనే చాలా ప్రాంతాల్లో ప్రసారాలు ఆగిపోయినట్లు ఎల్లోమీడియా తన మొదటి పేజిలోనే పెద్ద కథనం అచ్చేసింది.

 

అదే విషయాన్ని పార్టీ నేతలతో జరిగిన టెలికాన్ఫరెన్సులో చంద్రబాబు ప్రస్తావిస్తు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీడియా గొంతు నొక్కేస్తోందంటూ గగ్గోలు మొదలుపెట్టారు. కాకపోతే ఏబిఎన్ చానల్ ప్రసారాలని చెప్పకుండా కొన్ని వార్తా చానెళ్ళ ప్రసారాలంటూ మాట్లాడారు. న్యూస్ చానెళ్ళ ప్రసారాలను నిలిపేయాలని మంత్రులే బెదిరించటమేంటని విస్మయం వ్యక్తం చేశారట.

 

ఇది నిజంగా పెద్ద జోకే. ఎందుకంటే మీడియాను తొక్కేయటంలో అయినా మ్యానేజ్ చేయటంలో అయినా చంద్రబాబు తర్వాతే ఇంకెవరైనా. ఐదేళ్ళ పాలనలో సాక్షి మీడియాను తన ప్రెస్ మీట్లకు, పార్టీ కార్యక్రమాలకు రానీయకుండా బ్యాన్ చేసింది ఇదే చంద్రబాబు. మీడియా సమావేశాల్లో తనకు ఇష్టం లేని ప్రశ్నలను ఎవరైనా వేస్తే అటువంటి విలేకరులందరినీ అయితే జగన్ మనుషులని లేకపోతే ప్రభుత్వ వ్యతిరేకులుగా ముద్రవేశారు చంద్రబాబు.

 

ఇక తన హయాంలో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో సాక్షి ప్రసారాలతో పాటు కొంత కాలం ఎన్టీవి ప్రసారాలు కూడా ఆగిపోయాయి. వాటిని ఆపించేసింది ప్రభుత్వంలోని కీలక వ్యక్తులే. అప్పుడు కూడా ఎంఎన్వో లపై ఒత్తిడి తెచ్చే ప్రసారాలను నిలిపేయించారు. ఆ తర్వాత తెరవెనుక జరిగిన ఒప్పందం కారణంగా ఎన్టీవీ ప్రసారాలను పునరుద్ధరించారనే ప్రచారం అప్పట్లో జరిగింది. చాలా చోట్ల సాక్షి దినపత్రికను పంపిణీ చేయనీయుకుండా టిడిపి నేతలు అడ్డుకున్న విషయం అందరికీ తెలిసిందే.  తాను అధికారంలో ఉన్నపుడు చేసిన దురాగతాలు మరచిపోయిన చంద్రబాబు ఇపుడు మీడియా స్వేచ్చ గురించి మాట్లాడుతుండటం గురివింద గింజ నీతినే గుర్తు చేస్తోంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: