చంద్రబాబునాయుడు ఇచ్చిన భరోసా వల్లే ఆత్మకూరు గ్రామంలోని ఎస్సీ కుటుంబాలు గుంటూరు శిబిరంలో నుండి తిరిగి తమ స్వగ్రామానికి వెళ్ళినట్లు ఎల్లోమీడియా ప్రముఖంగా ఓ కథనం ఇచ్చింది. ఆ కథనంపై టిడిపితో పాటు జనాల్లో కూడా ముఖ్యంగా గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో చర్చ జరుగుతోంది. నిజానికి గుంటూరులో నిర్వహించిన శిబిరంలో నిజమైన బాధితులంటూ ఎవరు లేరు.

 

ఎందుకంటే ఆత్మకూరులో అసలు బాధితులే లేరు కాబట్టి. ప్రత్యేకించి వైసిపి నేతలెవరూ టిడిపి కార్యకర్తలపై దాడులు చేసింది లేదు, గ్రామం నుండి తరిమేసిందీ లేదు. జరిగిన గొడవంతా మామా, అల్లుళ్ళ కుటుంబాల మధ్య జరిగిన గొడవలని తేలిపోయింది. దాంతో చంద్రబాబు అయినా టిడిపి నేతలైనా తాము చేసిన రచ్చకు సిగ్గు పడాల్సిందే.

 

ఇటువంటి నేపధ్యంలోనే ఓ విషయమై పార్టీలో చర్చ జరుగుతోంది. చంద్రబాబు ఇచ్చిన భరోసాతోనే బాధితులు తమ గ్రామానికి తిరిగి వెళ్ళారన్నది పెద్ద జోక్ గా తయారైంది. ఎందుకంటే ఎక్కడో కు గ్రామాంలో జనాల్లో చంద్రబాబు భరోసా నింపగలిగినపుడు అగ్ర నేతల్లో ఎందుకు నింపలేకపోతున్నారు ? అన్నదే పెద్ద ప్రశ్నగా మిగిలింది.

 

అధికారంలో ఉన్నపుడు చేసిన అరాచకాలు రివర్సవుతున్న కారణంగా అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కొడుకు. కోడలు చాలా కాలంగా పరారీలో ఉన్నారు. గురజాల మాజీ ఎంఎల్ఏ యరపతినేని శ్రీనివాసరావు కూడా  ఎక్కడా కనబడటం లేదు. ఇక శ్రీకాకుళం జిల్లాలో మాజీ ఎంఎల్ఏ కూన రవికుమార్, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలు ఇంకా పరారీలోనే ఉన్నారు. 15 రోజులు పరారీలో ఉన్న మరో మాజీ ఎంఎల్ఏ చింతమనేని ప్రభాకర్ ను నిన్ననే పోలీసులు అరెస్టు చేశారు. పెయిడ్ ఆర్టిస్టుల్లోనే భరోసా నింపగలిగిన చంద్రబాబు తమ పార్టీ సీనియర్ నేతల్లో మాత్రం భరోసా ఎందుకు నింపలేకపోతున్నారు ? అన్నదే అందరిని ఆశ్చర్య పరుస్తోంది.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: