ఐనాక్స్ కేసులో చిదంబరం కోర్ట్ కేసులు ఎదుర్కొంటున్నాడు.  కొన్ని రోజుల క్రితం సిబిఐ సిబ్బంది చిదంబరాన్ని ప్రశ్నించిన సంగతి తెలిసిందే.  చిదంబరాన్ని ప్రశ్నించేందుకు దాదాపు వారం పాటు తమ కష్టడీలోకి తీసుకుంది.  ప్రశ్నలతో ఇరుకున పెట్టింది.  అనంతరం కోర్టులో చిదంబరాన్ని కోర్టులో ప్రవేశపెట్టారు.  కోర్టు చిదంబరాన్ని తీహార్ జైలుకు పంపిన సంగతి తెలిసిందే.  తీహార్ జైల్లో ఒక సాధారణ ఖైదీలానే ఆయన్ను ట్రీట్ చేస్తున్నారు.  


అయితే, బెయిల్ పిటిషన్ కోసం చిదంబరం కోర్టును ఆశ్రయించినా కుదరలేదు.  బెయిల్ మంజూరు కాలేదు.  అంతేకాదు, ఇంటి నుంచి భోజనం తెప్పించుకోవడానికి అనుమతి కోరారు.  కానీ, అందుకు కోర్టు అనుమతించలేదు.  అందరిలానే జైలు సిబ్బంది ఇచ్చే భోజనం తీసుకోవాలని చెప్పారు.  దీంతో చిదంబరం అందరు తీసుకున్న భోజనాన్ని తీసుకోవలసి వచ్చింది.  కాగా, ఇప్పుడు చిదంబరంపై ఈడీ కేసులు బనాయించింది. 


ఈడికి సరెండర్ అవుతానని చిదంబరం చెప్తున్నా.. కోర్టు మాత్రం ససేమిరా అంటోంది.  కోర్టు అనుమతి వచ్చే వరకు ఆయన తీహార్ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి రావడం విశేషం.  ప్రస్తుతం ఈడి చిదంబరం కూతురిని కూడా ప్రశ్నిస్తోంది.  ఐనాక్స్ డీల్ తరువాత చిదంబరం కుమార్తె ఆస్తులు పెరగడంతో ఆ దిశలో కూడా ఈడి ప్రశ్నిస్తోంది. తప్పు చేసిన వ్యక్తులను వదిలే సమస్య లేదని ఇప్పటికే కేంద్రం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. 


చిదంబరంతో పాటు అటు కర్నాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత డికె శివకుమార్ ను కూడా ఈడి అదుపులోకి తీసుకుంది.  ప్రస్తుతం ఆయన ఈడి అదుపులో ఉన్నారు.  ఆయన్ను కూడా త్వరలోనే తీహార్ జైలుకు పంపుతారని అంటున్నారు.  గతంలో అవినీతికి పాల్పడి అక్రమ ఆస్తులు సంపాదించిన వారి లిస్ట్ లను ప్రభుత్వం సిద్ధం చేస్తున్నది.  వారు ఎక్కడ ఉన్నా.. ఎలాంటి హోదాలో ఉన్నా చట్టం నుంచి తప్పించుకోలేరని కేంద్రం హెచ్చరికలు జారీ చేస్తోంది.  ఈ హెచ్చరికల నేపథ్యంలో తప్పు చేసిన నేతలు, వ్యాపారవేత్తలు భయాందోళనలో ఉన్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: