ఏపీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్ తీసుకున్న సంచ‌ల‌న నిర్ణ‌యం.. ఆస‌క్తిగా మారింది. అన్ని వ‌ర్గాల్లోనూ చ‌ర్చ నీయాంశ‌మైంది. ప్ర‌స్తుతం ఆయ‌నపై అమ‌రాతి, పొల‌వ‌రం స‌హా గుంటూరు జిల్లా ఆత్మ‌కూరు ఘ‌ట‌న వంటి వాటిని అస్త్రాలుగా చేసుకుని చంద్ర‌బాబు అండ్ కో విరుచుకుప‌డుతున్న ప‌రిస్థితి తెలిసిందే. జ‌గ‌న్ 100 రోజుల పాల‌న‌లో 125 త‌ప్పులు చేశార‌ని టీడీపీ కూడా విమ‌ర్శించింది. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ పాల‌న‌పై మేధావులు కూడా దృష్టి పెట్టారు.


వాస్త‌వానికి జ‌గ‌న్ త‌న పాల‌న విష‌యంలో ఎక్క‌డా త‌ప్పులు చేయ‌డం లేద‌నే విష‌యం తెలిసిందే. అయితే, రివ‌ర్స్ టెండ‌రింగ్ విష‌యంలో కొంద‌రు కాంట్రాక్ట‌ర్లు మాత్రం న‌ష్టం భ‌రించ‌క త‌ప్ప‌దు. ఇది త‌ప్ప‌..జ‌గ‌న్ పాల‌న బాగానే ఉంద‌నే టాక్ ఉంది. పాల‌న ప్రారంభించిన వెంట‌నే ప్ర‌క్షాళ‌న దిశ‌గా అడు గులు వేయ‌డం, ఉద్యోగ క‌ల్ప‌న‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డం, పింఛ‌న్లు పెంచ‌డం వంటి నిర్ణ‌యాల‌కు తోడు గిరిజ‌న విశ్వ‌విద్యాల‌యం, కిడ్నీ రోగుల‌కు ఆసుప‌త్రి నిర్మాణం వంటి కీల‌క విష‌యాల‌పై దృష్టి పెట్టారు.


అయిన‌ప్ప‌టికీ.. టీడీపీ నాయ‌కులు ఏదో ఒక విష‌యాన్ని ప‌ట్టుకుని విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. కానీ, జ‌గ‌న్ వీటిని పెద్ద‌గా ఖాత‌రు చేయ‌డం లేదు. అంత‌ర్గ‌తంగా టీడీపీ విష‌యాల‌ను కొద్ది మంతి త‌న అనుకున్న వారి వ‌ద్ద ప్ర‌స్థావిస్తున్నా.. పెద్ద‌గా వాటిపై మీడియాకు ప్రొజెక్టు కాకుండా చూసుకుంటున్నారు.
ఇక‌, ఇంత‌లోనే ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మైన ప‌థ‌కాల‌పై జ‌గ‌న్ దృష్టి పెట్టారు. దీనిలో భాగంగానే తాజాగా ఆరోగ్య శ్రీని మ‌రింత ప‌క‌డ్బందీగా న‌డిపించాల‌ని నిర్ణ‌యించుకున్నారు.  


డెంగీ, మలేరియా సహా అన్ని రకాల సీజనల్‌ వ్యాధులను ప్రభుత్వం  ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురానుంది. ఈ మేరకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఈ నిర్ణయంతో సుమారు 21రకాల సీజనల్‌ వ్యాధు లు ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తాయి. వైద్యం ఖర్చు రూ. 1,000 దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువస్తామన్న సీఎం జగన్‌ ప్రకటనకు అనుగుణంగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకూ కేవలం సూపర్‌ స్పెషాలిటీ సేవలు, ప్రసూతి సేవల కింద వచ్చే శస్త్రచికిత్సలు మాత్రమే ఆరోగ్యశ్రీలో ఉండేవి. ఇకపై వెయ్యి రూపాయిలు దాటిన ప్రాథమిక చికిత్సలను కూడా దీని పరిధిలోకే రానున్నాయి.


కొత్త చికిత్సలను జనవరి 1నుంచి పైలట్‌ ప్రాజెక్టు కింద పశ్చిమగోదావరి జిల్లాలో రెండునెలల పాటు అమలు చేయనున్నారు. పథకం అమలులో వచ్చే ఇబ్బందులను తొలగించుకుని, వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని యోచిస్తున్నారు. మరోవైపు బీపీ, షుగర్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధులకయ్యే ఖర్చును కూడా ప్రభుత్వమే భరించనుంది. ఈ వ్యాధులతో బాధపడుతున్న వారు కేవలం మం దులు కొనుగోలు చేసుకుంటే సరిపోతుంది. ఇవికాకుండా ఏదైనా సమస్యతో 24 గంటల పైన ఆస్పత్రిలో చికిత్స పొం దినా ఆరోగ్యశ్రీ వర్తించేలా ప్రణాళికలు సిద్ధం చే స్తున్నారు. ఈ నిర్ణ‌యాల‌తో జ‌గ‌న్ పాల‌న స‌రికొత్త దిశ‌గా అడుగులు వేయ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎన్నో విమ‌ర్శ‌ల‌కు ఇది చెక్ పెడుతుంద‌ని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: