ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఏడాది జనవరి 26 నుండి కొత్త జిల్లాలు అమల్లోకి వచ్చే అవకాశం ఉందన్న విష‌యం తెలిసిందే. అయితే కొత్త‌గా ఏర్ప‌డే జిల్లాల గురించి గతంలోనే దీనిపై చర్చ జరిగింది, కానీ అప్పుడు అది అమలులోకి రాలేదు. వైసీపీ ఎన్నిక‌ల మ్యానిఫేస్టోలో ఏపీలో జిల్లాల ఏర్పాటు గురించి హామి ఇవ్వ‌గా ఎన్నికల స‌భ‌ల్లోనూ మాటిచ్చింది.  వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే దీనిపై చర్చ నడిచింది. అనుకోకుండా ఏర్ప‌డిన కొన్ని ప‌రిస్థితుల్లో కొంత ప్ర‌తిష్టంభ‌న ఏర్ప‌డింది. అయితే సీఎం జ‌గ‌న్ వ‌రుస‌గా స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తూ, ఒక్కో హామిని అమ‌లు చేసేందుకు ముంద‌డుగు వేస్తున్నారు.


కొత్త జిల్లాల ఏర్పాటుపై ఇప్పటికే ఏపీ  గవర్నర్ విశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్‌కు  సీఎం జగన్ స‌మాచారం అందించటం జరిగింది. దీనికి గ‌వ‌ర్న‌ర్ కూడా గ్రీన్‌సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో  ఇక అధికారులు కొత్త జిల్లాల రూపకల్పనలో తలమునకలై ఉన్నారు. ముందుగా డివిజన్లు,మండలాలు అనేది వేరుచేయాలి, ఆ తర్వాత గ్రామాల సరిహద్దులు అనేవి పక్కాగా రెడీ చేయాలి, ఎన్నికల ప్రచారంలో ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లా చేస్తానని మాట ఇచ్చాడు జగన్ అందుకు తగ్గట్లే చేసేందుకు క‌స‌ర‌త్తు చేస్తున్నారు.


అయితే ప్ర‌స్తుతం ఉన్న జిల్లాలు 13 మాత్ర‌మే. దీంతో మండ‌లాలు, రెవెన్యూ డివిజ‌న్లు, జిల్లాల నడుమ దూరం బాగా పెరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని సీఎం జ‌గ‌న్ ప‌రిపాల‌న వికేంద్రీక‌ర‌ణ చేయాల‌ని, ప్ర‌జ‌ల‌కు పాల‌న అందుబాటులో ఉండేలా చూడాల‌ని, ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాలు స‌త్వ‌ర‌మే ప్ర‌జ‌ల‌కు అందేలా చూడాలంటే ఇంకా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాల‌ని సీఎం భావిస్తూ ఏపీలో కొత్త‌గా మ‌రో 12 జిల్లాల‌ను ఏర్పాటు చేస్తే మొత్తం 25 జిల్లాలు అవుతుంద‌ని అందుకు త‌గిన విధంగా జిల్లాల‌కు రూప‌క‌ల్ప‌న చేస్తున్న‌ట్లు వినికిడి.


ప్రస్తుతం ఉన్న జిల్లాలు 1. శ్రీకాకుళం, 2. విజయన‌గరం, 3. విశాఖపట్నం, 4. తూర్పుగోదావరి, 5. పశ్చిమగోదావరి, 6. కృష్ణా, 7. గుంటూరు, 8. ప్రకాశం, 9. నెల్లూరు, 10. కడప, 11. కర్నూలు, 12. అనంతపురం, 13. చిత్తూరు లు ఉన్నాయి. వీటికి తోడుగా ప్ర‌తి పార్ల‌మెంట్ స్థానాన్ని మ‌రో కొత్త జిల్లాగా చేయ‌నున్నారు. కొత్తగా రాబోతున్న జిల్లాలు ఇలా ఉన్నాయి. 1. అనకాపల్లి (విశాఖ), 2. అరకు (విశాఖ), 3. అమలాపురం (తూ.గో), 4. రాజమండ్రి (తూ.గో), 5 నరసాపురం (ప.గో), 6. విజయవాడ (కృష్ణా), 7. నరసరావుపేట (గుంటూరు), 8. బాపట్ల (గుంటూరు), 9. నంద్యాల (కర్నూలు), 10. హిందూపురం (అనంతపురం), 11. రాజంపేట (కడప), 12. తిరుపతి (చిత్తూరు) గా ఏర్పాటు చేయ‌నున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: