పాకిస్థాన్ ఒక దేశం కాదని చరిత్రకారులు అభిప్రాయపడతారు. కులం, మతం, వర్గం, వర్ణాలతో దేశాలు ఏర్పడవు. సమాజంలో అన్ని రకాలైన వారు ఉంటారు. ఫలనా వారే ఉండాలని గిరిగీసుకుని బతికే సమాజాలు తొందరగానే అంతరించిపోతాయి. ప్రక్రుతిలో భిన్నత్వం ఉంది. దాని ప్రతిబింబంగా సమాజంలోనూ అది కనిపించాలి. లేకపోతే ప్రక్రుతి విరుద్ధమే. ఇపుడు పాకిస్థాన్ విషయమే తీసుకుంటే ద్విజాతి సిధ్ధాంతం అనే దాన్ని వ్యాప్తి చేసి మహమ్మద్ ఆలీ జిన్నా అఖండ భరత్ ను రెండు ముక్కలు చేశాడు. అలా పాకిస్థాన్ ఏర్పడింది.


ఇంత చేసిన జిన్నా పాకిస్థాన్ ని ఎక్కువ రోజులు పాలించలేకపోయాడు. ఆయన కన్నుమూసిన తరువాత పాక్ స్వరూపమే మారిపోయింది. దాయాది పాత్ర కాస్తా శాడిస్టు పాత్రగా మారి భారత్ ని గత డెబ్బయ్యేళ్ళుగా నానా రకాలుగా హింస పెడుతూనే ఉంది. భారత్ కాబట్టే పాకిస్థాన్ ఇంతవరకూ అన్నేళ్ళు మనగలిగింది. ఇదే భారత్ స్థానంలో మరో దేశం కనుక ఉంటే పాక్ కి ఏనాడో మూడేదని అంటారు. 



అయితే ఇపుడు పాక్ కి నిజంగానే మూడిందంటున్నారు. కాశ్మీర్లో అల్లర్లు  రేపుతూ బతికేస్తున్న పాక్ కి మోడీ మాడు పగిలేలా దెబ్బ కొట్టాడు. కాశ్మీర్ లో విచ్చలవిడితనానికి కారణమవుతున్న 370 ఆర్టికల్ ని రద్దు చేయడంతో పాక్ గుండెల్లో మంటలు పుట్టాయి. ఇపుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని కూడా స్వాధీనం చేసుకునేందుకు భారత్ అడుగులు వేస్తోంది. ఈ నేపధ్యంలో పాకిస్థాన్ లో గొడవలు అలా ఇలా లేవని అంటున్నారు.


భారత్ నుంచి కాశ్మీర్ ని విడదీయాలన్న కుట్ర చేసిన పాక్ కి తన దేశంలోనే కొత్త గొడవలు మొదలయ్యాయట. ఆ దేశంలోని సింధ్, బెలూచిస్థాన్ సహా, మరి కొన్ని ప్రాంతాలలోని ప్రజలు పాకిస్థాన్ నుంచి విడిపోయేందుకు పోరాటాలు చేస్తున్నారని ఆరెసెస్ నాయకుడు ఇంద్రేష్ కుమార్ తాజాగా వ్యాఖ్యానించారు. ఈ పోరాటాలతో పాకిస్థాన్ పరిస్థితి దారుణంగా తయారైందన్న ఆయన ఆ ప్రాంతాలన్నీ పాకిస్థాన్ తో విడిపోతే పాక్ ప్రపంచ పటంలో కనిపించదని చెప్పుకొచ్చారు.


నిజానికి 1947 ముందు పాకిస్థాన్ అన్న దేశమే లేదు, ఇపుడు 2047 వస్తోంది. దానికంటే ముందే పాకిస్థాన్ ముక్కచెక్కలయ్యే ప్రమాదం వుందని అంటున్నారు. పాకిస్థాన్ లోనుంచి బంగ్లాదేశ్ 1970 దశకంలో విడిపోయి అప్పటికే సగం అయిపోయింది. మిగిలిన పాక్ కూడా సవ్యంగా లేదిపుడు. ముందు ముందు పాక్ అన్న దేశం మాయమయ్యే రోజులు వచ్చినా ఆశ్చర్యం లేదన్న ఆరెసెస్ నాయకుడి మాటలు నిజమవుతాయేమో.



మరింత సమాచారం తెలుసుకోండి: