కొందరు కొందరు కామసూత్రాలను బాగా చదువుతారేమో ఎప్పుడు చూడు,ఎక్కడ చూడూ వారిలోని కోరికలను ఆపుకోలేక విచ్చలవిడి శృంగారానికి తెర తీస్తారు.ఒకప్పుడు శృంగారం అనేది నాలుగు గోడల మధ్య నడిచే వ్యవహారం.కాని ఇప్పుడు నలుగురి మధ్య నడుస్తున్న యవ్వారం.ఇలాంటి యవ్వారమే చేసి ఒకడు చచ్చాడు.కాని చచ్చిన గాని సుఖపడ్డాడు.అతను పనిచేసే కంపెనీ వారు అతన్ని ట్రిప్‌కు ఆఫీస్ పనులు చక్కబెట్టు అని పంపిస్తే వాడు పర్సనల్ వ్యవహారం నడిపి ప్రాణాలు కోల్పోయాడు.కంపెనీ వారినుండి పరిహారం లాగాడు.మనదేశంలో ఐతే రోగం వచ్చో యక్సిడెంట్ ఐయ్యో ప్రాణాలు పోతే డబ్బులొస్తాయి కాని అతనికి సెక్స్ చేస్తూ ప్రాణాలు విడిచినా దండిగా డబ్బులు ముట్టచెప్పారు సదరు కంపెనీ వారు.ఇక ఈ సెక్స్ స్టోరీ ఎక్కడ జరిగిందో చూద్దాం..



ఫ్రాన్స్‌లోని పారీస్‌ నగరంలో నివసిస్తున్న ఎం.జావియర్ అనే వ్యక్తి రైల్వే కన్‌స్ట్రక్షన్ సంస్థలో పనిచేస్తున్నాడు.అతను 2013లో లోరైట్ అనే ప్రాంతానికి ఆఫీస్ పని మీద వెళ్లాడు.ఈ సందర్భంగా అతడికి పరిచయమైన ఓ మహిళను గదికి తీసుకెళ్లి.ఆమెతో సెక్స్ చేస్తుండగా గుండె నొప్పి వచ్చి చనిపోయాడు.ఇంకేముంది పనిచేయమని పంపిస్తే పాడుపని చేస్తూ పోయాడని అతను పనిచేసే కంపెనీ మృతుడి కుటుంబానికి పరిహారం అందించేందుకు నిరాకరించింది.ఈ కేసును విచారించిన కోర్టు అతడి మృతుడి కుటుంబానికి అతడు పనిచేస్తున్న సంస్థే పరిహరం చెల్లించాలని తీర్పు ఇచ్చింది.అతడు సెక్స్ చేస్తూ చనిపోతే ఆఫీసే ఎందుకు బాధ్యత వహించాలనే కదా మీ డౌట్! ఎందుకంటే అతడు ఆ సమయంలో ఆఫీస్ ట్రిప్‌లో ఉన్నాడు కాబట్టి.



ఇక సంస్థ తరఫు న్యాయవాది కోర్టు వారితో వాదిస్తూ,అతడు మహిళతో సెక్స్ చేయడమనేది ఆఫీస్ పనిలో భాగం కాదని పైగా,అతడు ఆఫీసు కేటాయించిన హోటల్‌లో చనిపోలేదని,అందువల్ల ఆ మరణంతో సంస్థకు ఎలాంటి సంబంధం లేదని,పైగా అతనికి అప్పగించిన పని చేయకుండా,వ్యక్తిగత పనులను చక్కబెట్టుకున్నాడని పేర్కొన్నాడు.ఇక వీరి వాదోపవాదనలు విన్న పారీస్ కోర్ట్ ఈ కేసును విచారించి భిన్నమైన తీర్పు వెల్లడించింది.ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.‘సెక్స్ అనేది రోజువారీ పనిలాంటిది.రోజూ స్నానం చేయడం,భోజనం తినడం ఎలాంటిదో.సెక్స్ చేయడం కూడా అంతే.అతడు మరణించే సమయానికి ఆఫీస్ ట్రిప్‌లోనే ఉన్నాడు కాబట్టి అది ఎలాంటి మరణమైనా ఆ సంస్థ బాధ్యత వహించాలి.ఇది ‘వర్క్‌ప్లేస్ యాక్సిడెంట్’గానే పరిగణించాలని తీర్పు ఇచ్చింది.అబ్బా ఇది ఏం రూలండి ఇలాంటిది కూడా ఇండియాలో వస్తే బాగుంటుందని ఇప్పటికే ఇది చదివిన వారు ఆలోచిస్తూ వున్నారని కొందరు అంటున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: