ఆపేవారు లేరన్నట్లుగా గత కొన్ని రోజులనుండి పరుగులు తీస్తున్న పసిడి తన స్పీడ్‌కు బ్రేకులు వేసుకుంటూ క్రమక్రంగా దిగుతూ వస్తుంది.దసరా ముందు భయం పెట్టి అంతలోనే ఆశను పుట్టిస్తున్న ఈ బంగారం ధరలు ఈ రోజు ఎలా వున్నాయో ఓ సారి చూద్దాం..హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గుదలతో రూ.39,400కు దిగొచ్చింది. గ్లోబల్ మార్కెట్‌లో బలహీనమైన ట్రెండ్ సహా దేశీ జువెలర్లు,రిటైలర్ల నుంచి డిమాండ్ పడిపోవడం బంగారం ధరపై ప్రతికూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.



అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.110 తగ్గుదలతో రూ.36,070కు క్షీణించింది.బంగారం ధర పడిపోతే.వెండి ధర మరింత స్థిరంగా కొనసాగింది. కేజీ వెండి ధర రూ.51,300 వద్దనే ఉంది.పరిశ్రమ యూనిట్లు,నాణేపు తయారీ దారుల నుంచి డిమాండ్‌‌ లేకపోవడం ఇందుకు కారణం అంటున్నారు.ఇక ఢిల్లీ మార్కెట్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.150 తగ్గుదలతో రూ.38,000కు దిగొచ్చింది.ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.150 తగ్గుదలతో రూ.36,800 కు తగ్గింది.ఇక కేజీ వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు.రూ.51,300 వద్దనే స్థిరంగా కొనసాగుతోంది.గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర పడిపోయింది.పసిడి ధర ఔన్స్‌కు 0.76 శాతం తగ్గుదలతో 1,496 డాలర్లకు క్షీణించింది.అదేసమయంలో వెండి ధర ఔన్స్‌కు 3.67 శాతం తగ్గుదలతో 17.51 డాలర్లకు దిగొచ్చింది.ఈ ధరల తగ్గుదల దసరా,దీపావళీ కానుకలా మారిందని పసిడిపై మోజున్న అలంకార ప్రియులు ముచ్చటించుకుంటున్నారు..ఇక బంగారం కొనుక్కోవాలని ఆశతో డబ్బులు దాచుకున్న మధ్యతరగతి వారు ఇంకాస్త బంగారం ధరలు తగ్గితే బాగుంటుందని ఆశపడుతున్నారు.ఏమో చెప్పలేం ధరలు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగితే ఎలా అని ఇప్పటికే కొందరు సర్దుకుంటున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: