పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి పరువు తీసుకున్నారు. అంతర్జాతీయంగా నవ్వుల  పాలయ్యాడు. అయితే జమ్మూకశ్మీర్‌కు సంబంధించి ఆర్టికల్‌ 370ని భారత్‌ రద్దు చేసి సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఇమ్రాన్ తప్పుడు ఓ ట్వీట్‌ చేయడం వల్ల అడ్డంగా బుక్ దొరికిపోయాడు. ఐక్యరాజ్యసమితిలోని మానవహక్కుల మండలి(యూఎన్‌హెచ్‌ఆర్సీ)లో 47 సభ్య దేశాలు మాత్రమే ఉండగా, ఏకంగా 58 దేశాలు తమకు మద్దతు ఇచ్చాయని ప్రకటించి నవ్వులపాలయ్యారు. అసలేం ఏం జరిగిందంటే.. ఇటీవల స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో యూఎన్‌హెచ్‌ఆర్సీ సమావేశం జరిగింది. ఇందుకు మొత్తం 47 సభ్య దేశాలూ హాజరయ్యాయి.

 

ఈ సందర్భంగా కశ్మీర్‌లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని పాక్‌ ఆరోపించింది. అందుకు దాన్నిభారత్‌ తిప్పికొట్టింది. యూఎన్‌హెచ్‌ఆర్సీలో తమ తీర్మానానికి 58 సభ్యదేశాలు మద్దతిచ్చాయని, ఆయా దేశాలకు ధన్యవాదాలు అంటూ ఇమ్రాన్ ఖాన్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అంతే ఆ ట్విట్టే ఇప్పుడు నవ్వుల పాలు చేసింది. అయితే యూఎన్‌హెచ్‌ఆర్సీ  మొత్తం 47 దేశాలు మాత్రమే. ఇమ్రాన్‌ ట్వీట్‌పై సామాజిక మాధ్యమాల్లో జోకులమీద జోకులు పేలుతున్నాయి. ఇమ్రాన్‌ భూగోళశాస్త్రంతో పాటు గణితం కూడా నేర్చుకుంటే మంచిదని నెటిజన్లు చురకలు అంటిస్తున్నారు.

 

కాగా, ఆర్టికల్ రద్దు చేయడంపై పాకిస్తాన్ నిప్పుల కుంపటిగా మారిపోతోంది. ఆ ఇర్టికల్ 370ని రద్దు ను వెనక్కి తీసుకోవాలని తెగ నాటకాలు ఆడింది. ఆర్టికల్ రద్దు చేయాలని ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ తన గోడు వెళ్లబోసుకొంది. ఇతర దేశాల మద్దతు కూడగట్టేందుకు తెగ ప్రయత్నాలు చేసింది. ఈ విషయంలో పాకిస్తాన్ కు ప్రపంచ దేశాల మద్దతు లభించలేదు. ఈ సమస్యను మీరే చూసుకోవాలని, తాము ఏ మాత్రం మద్దతు తెలుపమని ప్రపంచ  దేశాలు తెగేసి చెప్పడంతో …పాకిస్తాన్ కు ములిగే నక్కపై తాటి పండు పడ్డ చందంగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: