ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ఛానల్ టీవీల్లో రాకపోవడంపై జనం ఏమనుకుంటున్నారు.. ఈ విషయం తెలుసుకోవాలంటే.. ప్రజలు స్వచ్చంధంగా వెల్లడించే అభిప్రాయాలే కొంత వరకూ కరెక్టుగా ఉంటాయి. ఇదే ఆంధ్రజ్యోతి పత్రిక తన వార్తలను ఓ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఉంచుంది. ఆ ప్లాట్ ఫామ్ లో అన్ని పత్రికలు, వెబ్ సైట్ల వార్తలు ఉంటాయి. ఆ వార్తలపై జనం కామెంట్ చేసే సౌకర్యం కూడా ఉంటుంది.


నిన్న ఏబీఎన్ కనపడొద్దు.. అనే కథనాన్ని ఆంధ్రజ్యోతి డిజిటల్ మీడియా.. ఈ డిజిటల్ ప్లాట్ ఫామ్‌లో ఉంచింది. ఈ వార్తను చదివిన అనేక మంది పాఠకులు తన అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాశారు. విచిత్రం ఏంటంటే.. ఓ ఛానల్ ను అధికార పార్టీ అనధికారంగా నిషేధించి అని చెప్పిన తర్వాత కూడా చాలా మంది పాఠకులు.. ఈ ఛానల్ పై ఏమాత్రం జాలి చూపించలేదు.


ఈ కథనానికి వచ్చిన కామెంట్లు ఇలా ఉన్నాయి.. గుడ్, వెరీగుడ్.. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇప్పటికై మంచి పని చేశారు.. ఈ దరిద్రం వదిలిపోయింది.. మా తెలంగాణలో ఇంకా ఈ దరిద్రం వస్తూనే ఉంది. ఇలా సాగిపోయాయి కామెంట్లు.. 95 శాతం కామెంట్లు ఏబీఎన్, ఆంధ్రజ్యోతి మీడియాకు నెగిటివ్ గా ఉన్నాయి. కనీసం 5 శాతం మంది పాఠకులు కూడా అయ్యో పాపం.. ఒక మీడియాను అలా చేయకూడదని జాలి చూపించలేదు.


ఇంకొందరేమో.. ఆ సాక్షిని కూడా బ్యాన్ చేసేయండి.. అంటూ కామెంట్లు పెట్టారు. సోషల్ మీడియాలో , డిజిటల్ ప్లాట్ ఫామ్ లో వార్తలు చదివేవారు.. అన్ని వర్గాల వారూ ఉంటారు. అన్ని వర్గాల వారు కామెంట్లు పెడతారు.. కనీసం ఏబీఎన్ ఛానల్ పై టీడీపీ సోషల్ మీడియా సైనికులు కూడా జాలి చూపించలేదేమో అనిపిస్తోంది.


ఇదంతా ఏబీఎన్ ఛానల్ పై అనధికార నిషేధాన్ని సమర్థించడానికి కాదు.. కానీ ఓ మీడియాను వేధిస్తే.. జనంలో కనీస స్పందన కూడా లేదంటే.. ఆ మీడియా ఎంత పక్షపాతంగా ఇప్పటి వరకూ వార్తలు ఇచ్చిందో ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. తమ ఛానల్ నిషేధంపై వచ్చిన కామెంట్లను ఓ సారి చదువుకుని తప్పుదిద్దుకుంటే మేలు.


మరింత సమాచారం తెలుసుకోండి: