చంద్రబాబునాయుడు ఏమి చేసినా నాటకీయ పద్దతిలోనే చేస్తారు. స్టార్టింగ్ బాగానే ఉంటుంది కానీ కాకపోతే ఎండింగే చెత్తగా చేసుకుంటారు. తాజాగా గుంటూరులో ఏర్పాటు చేసిన వైసిపి బాధితుల శిబిరం ఇలాగే తయారైంది. కొమ్ము ఏసుబాబు అనే యువకుడు ఇపుడు చంద్రబాబు, టిడిపి నేతలపై బహిరంగంగానే మండిపోతున్నాడు. ఎందుకంటే శిబిరంలో ఉంటే తనకు రూ. 10 వేలు ఇస్తానని చెప్పి మోసం చేశారట.

 

శిబిరం ఖాళీ చేసే సమయంలో తనకు 10 వేల రూపాయలు ఇవ్వమంటే ఇవ్వకుండానే నేతలు వెళిపోయారంటున్నాడు. నిజానికి శిబిరంలో బాధితులంటూ ఎవరూ లేన్న విషయం అందరికీ తెలిసిందే. ఆత్మకూరు గ్రామంలో మామా-అల్లుళ్ళ మధ్య మొదలైన కుటుంబ తగాదాని పట్టుకుని చంద్రబాబు చాలా పెద్దదిగా చిత్రీకరించారు.

 

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గబ్బు పట్టించటం ఎలాగ అన్న విషయంపై తలలు బద్దలు కొట్టుకుంటున్న చంద్రబాబుకు మామా, అల్లుళ్ళు దొరికారు. ఇంకేముంది కోతిపుండును బ్రహ్మరాక్షిసిని చేసేశారు. ఏమీ లేని చోట కూడా ఏదో జరిగిపోతోందనే భ్రమలు కల్పించటంలో చంద్రబాబును మించినవాళ్ళు లేరు. దానికి ఎల్లోమీడియా కావాల్సినంత ఆజ్యం పోయటంతో ఓ పది రోజులు గోల గోలైపోయింది.

 

తమకు తెలీకుండానే తమ గ్రామంలో ఇన్ని దారుణాలు జరిగాయా అని ఆత్మకూరు వాసులే ఆశ్చర్యపడేట్లుగా చంద్రబాబు కంపు చేసేశారు. తీరా చూస్తే ఇదంతా  టిడిపి స్టేజ్ ప్లే అని తెలిశాక చంద్రబాబును అమ్మనాబూతులు తిడుతున్నారు. అయినా సరే చంద్రబాబు ఏమాత్రం వెనక్కు తగ్గటం లేదు.

 

గుంటూరులో ఆసుపత్రితో పనుండి వచ్చిన వాళ్ళు కొందరు, శిబిరంలో భోజనం పెడుతున్నారని తెలిసి కొందరు, అసలు శిబిరంలో ఏం జరుగుతోందో చూద్దామని వెళ్ళిన వాళ్ళని కూడా టిడిపి నేతలు పట్టి బంధించేసి బాధితులంటూ ప్రచారం చేసేశారు. ఈ విషయాలు తెలిసే శిబిరంలో ఉన్నది పెయిడ్ ఆర్టిస్టులే ఎక్కువమందున్నారంటూ హోం శాఖ మంత్రి సుచరిత ప్రకటించారు. మొత్తానికి పెయిడ్ ఆర్టిస్టుల కథలు ఒక్కోటిగా బయటకు వస్తున్నాయి.  చూద్దాం ఎంతమంది ఇలా బయటకు వస్తారో ?


మరింత సమాచారం తెలుసుకోండి: