జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం బీహార్ కంటే అధ్వాన్నమైన  స్థాయికి చేరిందని ఎంపీ కేశినేని నాని ఆరోపించారు. టీడీపీ హయంలో ఉన్నపుడు 5 ఏళ్ళు రాష్ట్రం ముఖ్యంగా కృష్ణాజిల్లా శాంతి భద్రతలతో ముందుకెళ్లిందని గుర్తు చేశారు. వై.సి.పి చేస్తున్న దాడుల కారణంగా హత్యయత్నంకి గురై విజయవాడ కొత్త  ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జగ్గయ్యపేటకు చెందిన టీడీపీ సానుభూతి పరుడు సలీంను అయన  పరామర్శించారు. ఈ సందర్బంగా నాని మాట్లాడుతూ.. వై.సి.పీ కార్యకర్తలు ఎక్కడికక్కడ టీడీపీ  కార్యకర్తలని, నాయకులపై మరణ కాండను సృష్టిస్తున్నారని చెప్పారు, ఎస్.సి, ఎస్.టి  కేసులు  దౌర్జన్యాలు అంటూ  తప్పుడు కేసులు  బనాయిస్తున్నారని అన్నారు.  వైసీపీ చేస్తున్న అరాచకం, అప్రజాస్వామికం ఒక ఫ్యాక్షన్ రాజ్యాన్ని తలపిస్తుందని మండిపడ్డారు.



వంద రోజుల్లోనే జగన్ పాలన పూర్తిగా విఫలమైందన్నారు. చంద్ర బాబు ఇచ్చిన భరోసాతో ఏపికి  దేశవిదేశాలలో నుంచి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారని చెప్పారు. ఇదిలా ఉండగా నిస్పక్షపాతంగా వ్యవహరించి ప్రజాస్వామ్యాన్ని కాపాడండంటూ ఏపి డీజీపి గౌతమ్ సవాంగ్  తో మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, డొక్కా మాణిక్య వర ప్రసాద్, ఎమ్మెల్సీ వైవీబి విజ్ఞప్తి చేశారు.రాష్ట్రంలో శాంతి భద్రతలను నెలకొల్పాలని ప్రజలకు తెదేపా కార్యకర్తలకు రక్షణ కల్పించాలని మేమారాండంతో పాటు వైకాపా దాడులకు సంబంధించి సాక్ష్యాలతో కూడిన రెండు పుస్తకాలను అందించారు. రాజధానిలో ఏపి డీజీపి గౌతమ్ సవాంగ్ ని కలిసి వైఎస్ ఆర్ సీపీ  ప్రభుత్వం 100 రోజుల పాలనలో తెదేపా నాయకులు కార్యకర్తల పై చేసిన దౌర్జన్యాలకు సాక్ష్యాలను సమర్పించి బాధితులకు న్యాయం చేయాలని మెమోరాండాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో  మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.




ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ..100 రోజుల వైఎస్సార్సిపి ప్రభుత్వ పాలనలో ప్రజలకు రక్షణకరువైందని , వైసీపీ నాయకుల ఆగడాలుశృతిమించి తెదేపా నాయకులు కార్యకర్తల ప్రాణాలు కోల్పోయిన పరిస్తితి ఉందని, 100 రోజులలో 500 గొడవలు సృష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని అన్నారు. మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, డొక్కామాణిక్యవరప్రసాద్, ఆలపాటి రాజా, జవహర్, మాజీ ఎమ్మెల్యేలు యరపతనేని, గద్దె రామ్మోహన్, బోండా ఉమా, పోతుల సునీత, తంగిరాల సౌమ్య,  ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ తదితర ప్రజాప్రతినిధులు  డీజీపి సవాంగ్ ని కలిసిన వారిలో ఉన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: