భాగ్యనగరంలో వినాయక చవితి సందడి ముగిసింది. కోలాహలం తగ్గిపోయింది.  నిన్నటితో నిమర్జన కార్యక్రమాలు ముగిశాయి.  12 వ తేదీతోనే నిమర్జనం ముగిసినా కొన్ని చోట్ల ఈ నిమర్జన కార్యక్రమాలు నిన్నటి రోజున కూడా జరిగాయి.  మొత్తానికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిమర్జనం ముగిసింది. నిమర్జనం ముగియడంతో.. ఇప్పుడు పోలీసుల దృష్టి హుస్సేన్ సాగర్ క్లీనింగ్ పై పడింది.  హుస్సేన్ సాగర్ ను క్లీన్ చేయడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి.  వేలాది విగ్రహాలను అందులో నిమర్జనం చేశారు.  విగ్రహాల్లోని ఇనుమును ఆ నీటి నుంచి బయటకు తీసి విక్రయిస్తారు.  దీని వలన ప్రభుత్వానికి కొంత ఆదాయం వస్తుంది.  ఇది వేరే విషయం అనుకోండి.  


నిమర్జనం జరిగే సమయంలో విగ్రహం ముందు కోలాహలంగా డ్యాన్స్ చేస్తూ.. భక్తులు భక్తిపారవశ్యంతో నడుస్తుంటారు. కొంతమంది కాస్త డ్రింక్ చేసి మరింత జోష్ పెంచుతారు.  ఇలా వినాయకుడి విగ్రహం దగ్గర డ్యాన్స్ చేస్తూ పోలీసులతో వాదానికి దిగాడు ఓ వ్యక్తి.  వాదనకు దిగిన వ్యక్తి మద్యం తీసుకొని ఉన్నాడు.  ఈ సంగతి పోలీసులకు తెలుసు.  ఆ సమయంలో పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తే చాలా గొడవలు జరిగిపోతాయి.  అందుకే సైలెంట్ గా చూస్తూ ఉన్నారు.  పాపం ఆ వ్యక్తి డ్యాన్స్ చేసి చేసి అలసిపోయి వెళ్ళిపోయాడు.  


పోలీసులు సైలెంట్ గా ఉండటంతో ఇది సాధ్యం అయ్యింది.  అంతేకాదు, నిమర్జనం సందర్భంగా రాజకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో శోభాయాత్రలో ఓ మహిళ పోలీసుల ముందు డ్యాన్స్ చేసింది. టిక్ టాక్ వీడియో కోసం ఆ మహిళా డ్యాన్స్ చేయడం విశేషం.  మహిళా డ్యాన్స్ చేస్తున్నా.. పోలీసులు చూస్తుండిపోయారుగాని పెద్దగా పట్టించుకోలేదు.  శోభాయాత్ర కావడం.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలని ముందుగానే ఆదేశాలు జారీ కావడంతో పోలీసులు సైలెంట్ గా ఉన్నారు. 


ట్యాంక్ బండ్ దగ్గర పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన వ్యక్తి, రాచకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసుల ముందు డ్యాన్స్ చేసిన మహిళ ఎవరు ఏంటి అనే దాని గురించి నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు.  పోలీసుల ముందు డ్యాన్స్ చేసి చిరునవ్వులు చిందిస్తున్న మహిళకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.  ఈ వీడియోకు నెటిజన్లు లైక్ లు షేర్ లు చేస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: