ఆర్టికల్ 370 రద్దు తరువాత ఇండియా పాక్ దేశాల మధ్య సంబంధాలు దారుణంగా మారిపోయాయి.  ఈ రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేయడకుండానే భగ్గుమంటోంది.  పైగా పాక్ చేస్తున్న  ఆరోపణలు  ఇబ్బందికరంగా మారాయి.  అక్కడి నేతలు ఎవరికి తోచినట్టు వారు మాట్లాడుతున్నారు.  ప్రధాని స్థాయిలో ఉన్న ఇమ్రాన్ ఖాన్ నిన్నటి రోజున పీవోకేలో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  కాశ్మీరులకు తాము సహాయంగా ఉంటాయని, కాశ్మీరీలు  ఆయుధాలు చేపట్టి భారత సైన్యంపై తిరగడబడాలని పిలుపునిచ్చారు. 

ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.  పాకిస్తాన్ లో జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘనను పట్టించుకోవాలని, పాక్ అభివృద్ధిపై దృష్టిపెట్టాలని అక్కడి యువత కోరుకుంటోంది.  పలుమార్లు సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.  కానీ, పాక్ మాత్రం ఆ మాటలను పట్టించుకోకుండా కాశ్మీర్ పై పెద్ద రగడ చేస్తున్నది.  జమ్మూ కాశ్మీర్ విషయంలో మరో దేశం జోక్యం అవసరం లేదని ఇప్పటికే ఇండియా హెచ్చరించిన సంగతి తెలిసిందే.  


భారత కేంద్ర మంత్రి రాందాస్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.  నరేంద్ర మోదీ దమ్మున్న ప్రధాని అని.. ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తూ మోదీ సర్కారు చారిత్రక నిర్ణయం తీసుకుందని ప్రశంసలు కురిపించారు. కశ్మీర్‌ విషయంలో భారత్‌ తీసుకున్న నిర్ణయం పాకిస్తాన్‌కు మింగుడుపడటం లేదని.. అందుకే అంతర్జాతీయ వేదికలపై అసత్యాలు ప్రచారం చేస్తోందని అన్నారు.  పాకిస్తాన్ మర్యాదగా పీవోకేను ఇండియాకు అప్పగిస్తే.. పాక్ అభివృద్ధికి ఇండియా తోడ్పాటు అందిస్తుందని, అభివృద్ధిలో భాగస్వాయం అవుతుందని అన్నారు.  


ఒకవేళ పాక్ యుద్ధమే కోరుకుంటే దానికి సిద్ధంగా ఉన్నట్టు సైన్యం ఇప్పటికే ప్రకటించిందని.. పాక్ యుద్దాన్ని కోరుకోదని అనుకుంటున్నట్టు అయన చెప్పారు.  కార్గిల్ యుద్దాన్ని గుర్తు చేసుకోవాలని అన్నారు.  యుద్ధం వలన పాక్ దేశానికే భారీ నష్టం వస్తుంది. అయితే, ఆ దేశం మాత్రం ఇవేమి పట్టించుకోకుండా పేద రగడ చేస్తున్నది. అక్టోబర్ లో ఇండియాతో యుద్ధం వస్తుందని ఆ దేశ మంత్రులు చెప్తుండటం ఆందోళన కలిగిస్తున్నది. 


మరింత సమాచారం తెలుసుకోండి: