ఏపీలో రాజకీయం రోజురోజుకు రంగుగా మారుతుంది. రాజకీయ నేతలు ఎవరికి వారు తమ రాజకీయ భవిష్యత్తు కోసం రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసిపి లేదా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపినో  ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలోనే కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం బిజెపిలో చేరుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముద్రగడ పద్మనాభం ఇప్పటికే బిజెపికి చెందిన జాతీయ నేతలతో సంప్రదింపులు జరిపారని.. ఆయన బిజెపిలో చేరేందుకు సుముఖంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. కాపు ఉద్యమం ప్రభావంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన ముద్రగడ టిడిపి... వైసిపిలకు భిన్నంగా తనకున్న సామాజిక సమీకరణలు వాడుకుని మరింత బలంగా ఎదగాలని కొద్దిరోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు.


ఇక ఏపీలో రోజురోజుకు బిజెపి బలపడుతుందని అంచనా వేస్తున్న నేతలందరూ ఇప్పుడు కాషాయం గూటికి చేరుకుంటున్నారు. బిజెపి సైతం ముఖ్యమంత్రి జగన్ ను టార్గెట్ గా చేసుకుని పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే ఏపీలో సంఖ్యాపరంగా బలంగా ఉన్న కాపు సామాజిక వర్గానికి కొద్దిరోజులుగా ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది. ప్రస్తుతం బిజెపి అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ సైతం ఈ వర్గానికి చెందిన వ్య‌క్తి అన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఉద్యమ నేతగా ఉన్న ముద్ర‌గ‌డ‌ను పార్టీలో చేర్చుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. కాపు రిజర్వేషన్ అంశం మీద బీజేపీ నుంచి సానుకూలమైన ప్రకటన వస్తే బిజెపిలో వెంటనే చేరేందుకు ఓకే చెప్పే ఆలోచనలో ముద్ర‌గ‌డ‌ ఉన్నారట.


ముద్రగడకు ఏపీ రాజకీయాల్లో సుధీర్ఘమైన అనుభవం ఉంది. ఆయన మాజీ మంత్రిగాను.. ఎంపీగా పనిచేశారు. ఇక కాపు సామాజిక వర్గాన్ని ఆకట్టుకునే గ్రామంలో బిజెపి ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో సైతం చర్చలు జరుపుతోంది. ఇక పవన్ ఇటీవల యూటర్న్ తీసుకున్నట్టే కనిపిస్తోంది. ప్రధాని మోదీతో పాటు అమిత్ షా పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఏపీ రాజకీయాలు పూర్తిగా కుల సమీకరణాలు మీదే ఆధారపడి ఉన్నాయి. ఈ క్రమంలోనే కాపు వర్గానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణ, పవన్ కళ్యాణ్, ముద్రగడ పద్మనాభం లాంటి కాపు నేతలకు ఇవ్వడం ద్వారా భవిష్యత్తులో జగన్ కు కాపుల మద్దతు లేకుండా చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.


చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాపులకు ఈడబ్ల్యుుయస్ కోటాలో అయిదు శాతం రిజర్వేషన్లు చేసిన నిర్ణయాన్ని జగన్ ప్రభుత్వం రద్దు చేసింది. ఆ టైంలో టీడీపీ నేత‌ల కంటే బీజేపీ వాళ్లే ఎక్కువుగా రియాక్ట్ అయ్యారు. కాపు రిజర్వేషన్ల అంశం మీద చంద్రబాబు విఫలమవ్వటం..జగన్ హమీ ఇవ్వకపోవటంతో దీనిని తమకు అనుకూలంగా మలచుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఇక ముద్ర‌గ‌డ సైతం ఇదే అంశంపై సానుకూల హామీ ఇస్తే బీజేపీలో చేరేందుకు రెడీగా ఉన్న‌ట్టు టాక్‌.



మరింత సమాచారం తెలుసుకోండి: