ఆంధ్ర ప్రదేశ్ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వంద రోజుల పాలనా పూర్తి చేసుకొని 10 రోజులు అయ్యింది. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ఈరోజే 100 రోజులు అయినట్టుంది. అందుకే ఈరోజు అమరావతిలో జగన్ 100 రోజుల పాలనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టాడు. జగన్ 100 రోజుల పాలనపై జనసేన బుకెల్ట్ విడుదల.. 


పచ్చ పార్టీ మాటలను గుర్తు చేస్తూ పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. వైఎస్ జగన్ ప్రభుత్వం కనీసం సంవత్సరం పాటు అయినా వ్యతిరేకత తెచ్చుకోదని భావించామని, కానీ మూడు నెలలకే జగన్ ప్రభుత్వం వ్యతిరేకత తెచ్చుకుందని పవన్ కళ్యాణ్ మాట్లాడటం మొదలు పెట్టాడు. ఆ తరవాత జగన్ 100 రోజుల పాలనపై జనసేన బుక్ లెట్ ని విడుదల చేశాడు పవన్ కళ్యాణ్. జగన్ పాలనలో పారదర్శకత, దార్శనికత లోపించదంటూ బుకె లెట్ ని విడుదల చేశారు. 


9 అంశాలపై 33 పేజీల నివేదిక విడుదల చేశారు పవన్ కళ్యాణ్. ఇసుక విధానం, పెట్టుబడులు ఆకర్షింధంలో ప్రభుత్వం విఫలం అయ్యిందని, పోలవరం, ప్రజారోగ్యం పడకేసిందని అయన వ్యాఖ్యానించారు. కాగా అమరావతి గృహనిర్మాణంపైనా నివేదిక ఇచ్చారు. అయితే వైఎస్ జగన్ పాలన మొదలై కేవలం 3నెలలు అయ్యింది. అప్పుడే ఇంత గొరంగా వ్యవహరిస్తున్నాయి ప్రతిపక్షాలు. ఏ ప్రభుత్వానికి అయినా కనీసం ఆరు నెలలు గడువు ఇవ్వాలని కూడా తెలీదు వీరికి.. వీళ్ళు కూడా ప్రెస్ మీట్ లు పెడుతున్నారు అని అంటున్నారు ప్రజలు.   


మొన్నటివరకు చంద్రబాబు చలో ఆత్మకూరు అంటూ రాష్ట్రంలో అల్లర్లు సృష్టించారు. ఇప్పుడు చలో అమరావతి అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టి అల్లరి చేస్తున్నాడు. ఇద్దరికిద్దరు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా దించాలని ప్రయత్నిస్తున్నారు అంటూ ప్రజలు ఫైర్ అవుతున్నారు. ఎవరు ఎన్ని చేసిన జగన్ పాలన అద్భుతం అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. 



మరింత సమాచారం తెలుసుకోండి: