ఏపీలోని వైసీపీ ప్రభుత్వం,పాలన విషయంలో కొందరు సంతృప్తిని వ్యక్తం చేస్తుంటే,మరికొందరు అసంతృప్తితో విమర్శలు చేస్తున్నారు.ఇప్పటివరకు చంద్రబాబు,జగన్ పాలనను విమర్శించగా విన్నాము.కాని ఇప్పుడు జగన్  వంద రోజుల పాలనపై పెదవి విప్పాడు పవన్ కళ్యాణ్.ఇదివరకే జగన్ పాలనపై అధ్యయనం చేసేందుకు పార్టీ నేతలు,నిపుణులతో కొద్దిరోజుల క్రితం కమిటీ వేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.తాజాగా దీనిపై కమిటీ నుండి నివేదిక అందింది.ఈ నివేదికను సీఎం జగన్ వంద రోజుల పాలన పూర్తి కావడంతో విడుదల చేసింది.మొత్తం 9 అంశాలతో కూడిన 33 పేజీల నివేదికను పవన్ వెల్లడించారు.ఈ నివేదికలో ఇసుక విధానం,పెట్టుబడులను ఆకర్షించడంలో వైఎస్ఆర్సీపీ సర్కారు విఫలమవ్వడమే కాకుండా పోలవరం,ప్రజారోగ్యం పడేకేసిందని విమర్శించారు.



ప్రభుత్వానికి చిత్తశుద్ధి లోపించిందని పవన్ ధ్వజమెత్తారు.అంతే కాకుండా అమరావతి,గృహనిర్మాణంపై కూడా పవన్ ఈ సందర్భంలో తన నివేదికలో చర్చించారు.తొలుత జగన్ సర్కారు పనితీరుపై మాట్లాడే అవకాశం మాకు సంవత్సరం వరకు రాదని భావించామని,కాని మూడున్నర నెలల్లోనే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రజల్లో వ్యతిరేకతను తీసుకొచ్చేలా వున్నాయని పవన్ వ్యాఖ్యానించారు.గత ప్రభుత్వంలో చెలరేగిన ఇసుక మాఫియా దందాను అరికడతామని వైఎస్ఆర్సీపీ తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు 19 లక్షల 34 వేల మంది రోడ్డునపడ్డారని దుయ్యబట్టారు.ఇసుక కొరత వల్లే వారంతా ఉపాధికోల్పోయారని,వంద రోజుల్లో ఇసుక విధానాన్ని తీసుకురాలేకపోవడం వారి అసమర్ధతకు నిదర్శనమని విమర్శించారు.అంతే కాకుండా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని,పాఠశాలల్లో మౌలికవసతులు లేక పిల్లలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నరని,నివేదికలో పవన్ వివరించారు.ఇక ఒకప్పుడు తెలుగుదేశం హయాంలో జన్మభూమి కమిటీలు ఎంతగా నష్టపరిచాయో,ఇప్పుడు గ్రామ వాలంటీర్ వ్యవస్థ వల్ల అంతే నష్టం జరుగుతుందని జనసేనాని విమర్శించారు.



నా బాధ ఏంటంటే మీ నుండి న్యాయవంతమైన పాలన ఆశించిన ప్రజలు ఇప్పుడు భంగపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.నేను ఇంతలా మాట్లాడుతున్నానంటే దానికి కారణం నేను తూతూ మంత్రంగా నివేధిక తయారుచేసి చౌకబారుమాటలు చెప్పడం లేదని,సమస్యలను లోతుగా పరిశీలించాకే  విమర్శలు చేస్తున్నట్టు పవన్ స్పష్టం చేశారు. ఇక ఆర్ధిక శాఖపై సీఎం డ్యాష్ బోర్డులో ఎలాంటి సమాచారం లేదని,జిల్లాకు రావాల్సిన పరిశ్రమలు పక్కరాష్ట్రానికి పోతున్నాయని తూర్పారబట్టారు.నేను,ఈ రాష్ట్ర ప్రజలందరు మీ నుండి ఆశించేది ఒక్కటే ప్రజలకు, వ్యవస్ధకు,మంచి జరిగాలని మీపాలన ఆరోగ్యవంతంగా సాగాలని కోరుకుంటున్నామని తెలిపారు..ఇక కొందరు మంత్రులు మంత్రి పదవులను అనుభవించడానికే అనేవిధంగా భావిస్తున్నారని విమర్శించారు.కనీసం రైతులు విత్తనాల కోసం క్యూలో నిలబడి ప్రాణాలు కోల్పోతే సానుభూతి చూపకుండా మంత్రులు మాట్లాడటం బాధాకరమని, దుమ్మెత్తిపోశారు...

మరింత సమాచారం తెలుసుకోండి: