కశ్మీర్ అంశంలో అంతర్జాతీయ దేశాలన్ని తమను ముంచేశాయని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశాడు. కశ్మీర్ ను భారత్ ను కలిపేసుకోవడంపై పోరాటం చేద్దామనకున్న తమకు మిత్రదేశాలు కూడా అండగా నిలవకపోవడం ఆశ్చర్యం కల్గించిందని రష్యా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇమ్రాన్ తెలిపాడు.

అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్ పదే పదే వివాదంగా మార్చాలని ప్రయత్నించినా ప్రతి చోట వారికి ఎదురుదెబ్బలే తగిలాయి. మరోవైపు  కశ్మీర్ అంశంపై పరిస్థితులకు తగ్గట్టుగా ఇమ్రాన్ వ్యవహరించలేదంటూ ఆ దేశానికి చెందిన విపక్షాలతో పాటు మాజీ ప్రధానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. దీంతో  ఇమ్రాన్ ఖాన్  పూర్తిగా నైరాశ్యంలో కూరుకుపోయినట్లుగా తెలుస్తోంది.

కాగా ఇప్పటికే కశ్మీర్ అంశం ఇరుదేశాలకు సంబంధించిన వ్యవహరమని దీనిలో తాము జోక్యం చేసుకోబోమని ఐక్యరాజ్య సమితికి చెందిన దేశాలతో పాటు పలు అంతర్జాతీయ వేదికలపై వివిధ దేశాల ప్రతినిధులు చెప్పగా.. మిత్రదేశమైన చైనా కూడా పాకిస్థాన్ కు ఈ విషయంలో ఎలాంటి సాయం చేయకపోవడం కూడా ఇమ్రాన్ కు మింగుడుపడటం లేదు.

ఇప్పటికే ఆర్థికంగా వివిధ దేశాల నుంచి నిధులు పొందలేకపోతున్న పాకిస్థాన్ కు కశ్మీర్ విషయంలో కూడా నైతిక మద్దతు లభించకపోవడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఇమ్రాన్ ఉన్నాడని తెలుస్తోంది. భారత్ తో వాణిజ్య అవసరాల దృష్ట్యా చైనా కూడా ఈ అంశంలో పాక్ ను పక్కన పెట్టేసిట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద కశ్మీర్ అంశంలో ఇమ్రాన్ విధానాలు సరిగా లేవని సొంత పార్టీ నుంచే విమర్శలు వస్తున్నాయి.  కాగా భారత్ కు వ్యతిరేకంగా తమ మిత్రదేశాలకు మాట్లాడలేకపోవడానికి కారణం ఆయా దేశాల్లో నెలకొన్న ఆర్థికమాంద్యం వల్లేనని ఇమ్రాన్ ఈ ఇంటర్వ్యూలో పేర్కొనడం కొసమెరుపు.


మరింత సమాచారం తెలుసుకోండి: