ఒకపని మీద బయలుదేరినప్పుడు తెలియకుండానే ఆలస్యం అవుతుంది.  అలా ఆలస్యం జరిగినపుడు కొంత లాస్ వచ్చే అవకాశం ఉంటుంది.  అయితే, జాపనీస్ ఎయిర్ వేస్ లో ప్రయాణం చేసిన వాళ్లకు లాస్ రాలేదు.  లాభం వచ్చింది.  అందులో ప్రయాణం చేసిన ప్రయాణికులకు 60 వేల డాలర్లు చెల్లించారు.  కారణం ఏందీ అంటే విమానం నాలుగు గంటలు ఆలస్యంగా ప్రయాణం చేయడమే.  జాపనీస్ ఎయిర్ వేస్ కు చెందిన విమానం  టోక్యో నుంచి న్యూయార్క్ కు బయలుదేరింది.  అయితే, కొంత సాంకేతిక సమస్యల కారణంగా ఆ విమానం చికాగో లో ల్యాండ్ అయ్యింది.  


నాలుగు గంటల ఆలస్యం తరువాత న్యూ యార్క్ వెళ్ళింది.  అలానే మే 15 వ తేదీన అదే ఎయిర్ లైన్స్ కు చెందిన మరొక విమానం టోక్యో నుంచి న్యూయార్క్ కు వెళ్తూ.. మధ్యలో  ఇంధనం కోసం వాషింగ్టన్ కు మళ్లించారు.  అక్కడ ఇంధనం నింపుకున్న తరువాత విమానం తిరిగి న్యూయార్క్ కు వెళ్ళింది.  అప్పుడు కూడా దాదాపు నాలుగు గంటల సమయం ఆలస్యం అయ్యింది.  ఒక విమాన సంస్థ రెండుసార్లు ఆలస్యంగా సర్వీసులు నడిపి ప్రయాణికుల సమయం వృధా చేసినందుకు జాపనీస్ ఎయిర్ లైన్స్ కు 3 లక్షల డాలర్ల ఫైన్ వేశారు.  


అంటే మన ఇండియన్ కరెన్సీలో 21 కోట్లు.  ఇందులో 60వేల డాలర్లను ప్రయాణికులకు పరిహారంగా ఇచ్చారట.  సంవత్సరంలో ఇలా మరోసారి జరగకుండా ఉంటె..  చెల్లించిన ఫైన్ నుంచి లక్షా 21 వేల డాలర్లు తిరిగి ఆ ఎయిర్ లైన్స్ కు రిఫండ్ అవుతాయి.  అయితే, సాంకేతిక లోపం కారణంగానే ఆలస్యం అయ్యిందని, మరోవిధంగా కాదని జాపనీస్ ఎయిర్ లైన్స్ పేర్కొన్నది.  ఎలా జరిగినా ఆలస్యం ఆలస్యమే కాబట్టి ఫైన్ కట్టింది ఎయిర్ లైన్స్.  


ఇటీవలే  ఇండియాలో  భారీ వర్షాల కారణంగా పలు విమానాలు రద్దు చేసిన సంగతి తెలిసిందే.  ఇండిగో విమానాలు రన్ వే మీదనే రాత్రి వేళా ఆగిపోయాయి.  అందులోని ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. ఇండిగో విమానం రాత్రి మొత్తం రన్ వే మీదనే ఉండటంతో పాటు అందులోని ప్రయాణికులకు  ఆహరం కూడా ఇవ్వకపోవడంతో ప్రయాణికులు ఫైర్ అయిన సంగతి తెలిసిందే.  మరి దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో ఇంకా తెలియలేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: