పాకిస్తాన్ కి ఈ మధ్య ప్రతి రోజూ నరకంగా మారుతోంది. మొన్నటికి మొన్న కరెంట్ బిల్ కట్టలేదని పాక్ ప్రధాని ఆఫీసులో ఫ్యూజ్ పీకేశారు. కాశ్మీర్ విషయంలో అంతర్జాతీయ దేశాల నుంచి వారికి ఎలాంటి మద్దతు రాకపోవడంతో ఇమ్రాన్ ఖాన్ నిన్నే తన బాధ వెళ్లగక్కాడు. ఒకపక్క అప్పులు... మరోపక్క ఆర్థికమాంద్యంతో ఇబ్బందిపడుతున్న పాకిస్తాన్ కి ఇప్పుడు బంగ్లాదేశ్ మరో షాక్ ఇచ్చింది. తమ సరిహద్దుల్లో దాదాపు 48 సంవత్సరాలుగా ఉన్న పాకిస్తాన్ పేరుని తుడిచి పారేశారు. 

1947లో దేశ విభజన జరిగిన తర్వాత బంగ్లా బార్డర్ లో పాకిస్తాన్ పేరు చెక్కబడింది. మొట్టమొదటిసారి బంగ్లాదేశ్ తమ సరిహద్దుల్లో ఉన్న స్థంబాలన్నింటిలో పాకిస్తాన్ పేరును కొట్టి పారేశారు. 1971లో ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన లిబరేషన్ యుద్ధం తరువాత బంగ్లాదేశ్ ఏర్పడింది. అప్పటి నుంచి ఆ సరిహద్దుల్లోని స్తంభాలపైన పాకిస్తాన్ పేర్లను అలాగే ఉంచారు. ఏమైందో ఏమో కానీ ఇప్పుడు ఉన్న ఫలంగా పాకిస్తాన్ పేరుని తొలగించేస్తున్నారు.

దీనికి కావాల్సిన ఖర్చు మొత్తం మన దేశమే పెట్టుకునేలా బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా సరిహద్దుల్లో ఉండే అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇండియా మరియు పాకిస్తాన్ విడిపోయిన తర్వాత దాదాపు 8వేల సరిహద్దు స్తంభాలు అక్కడ ఉంచారు. వాటిపైన ఇండియా మరియు పాకిస్తాన్ దేశాల పేర్లను చెక్కించారు. 

ఇప్పుడు బంగ్లా దేశి సరిహద్దు స్తంభాల్లో పాకిస్తాన్/పాక్ కు బదులుగా బంగ్లాదేశ్/బిడి అని రాయిస్తున్నారు. ఈ ప్రక్రియ స్తంభాలు ఉన్న అన్నీ సరిహద్దు ప్రాంతాల్లో జరుగుతోంది. వాటిలో రాజ్ షాహీ, జమాల్పుర్, సిలెట్, కొమిల్ల, మైంసింగ్ మరియు చిట్టగాంగ్ ప్రధానమైనవి. ఇప్పుడు ఉన్నపళంగా పాక్ పేరును తొలగించాలని కారణం పాకిస్థాన్ తమ ఉగ్రవాదాన్ని బంగ్లాదేశ్ కూడా విస్తరింపజేసేందుకు ప్రయత్నించడం అని పలువురి మాట. అది కాకుండా భారతదేశంతో మంచి సంబంధాలు కలిగిన బంగ్లాదేశ్ కు అధికరణ 370 రద్దు చేసిన తర్వాత పాక్ ప్రవర్తన కూడా నచ్చలేదట. దీంతో పాక్ పేరే తమ దేశంలో కనపడకుండా చేస్తున్నారు బంగ్లా బాబులు.


మరింత సమాచారం తెలుసుకోండి: