ఎట్టకేలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనపై పవన్ తన నోరు విప్పాడు. శుక్రవారం మంగళగిరిలోని తన పార్టీ ఆఫీస్ లో జగన్ వంద రోజులు పాలనకు సంబంధించి ఒక రిపోర్టును చదివి వినిపించాడు పవన్ కళ్యాణ్. ఆయా సెగ్మెంట్లను ప్రస్తావించిన పవన్ జగన్ పైన డైరెక్ట్ అటాక్ చేసాడు. జనసేనాని చెబుతున్న దాని ప్రకారం పెట్టుబడులు, ఆరోగ్యం, పోలవరం, ఇసుక పాలసీ మరియు పిపిఎ ల విషయంలో జగన్ భారీగా విఫలమయ్యాడట. 

ఇకపోతే జగన్ పాలనలో శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయని, గవర్నమెంట్ పాఠశాలల్లో కనీస సదుపాయాలు లేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఘోరంగా తయారైందని విమర్శించాడు పవన్. జగన్ పాలనలో ముందుచూపు మరియు పారదర్శకత లేకపోగా డెంగ్యూ మలేరియా లాంటి రోగాలను సైతం ఆయన అరికట్టేందుకు సరైన ప్రణాళికలు వేయలేకపాడని ఎద్దేవా వేశాడు. ఇలా జగన్ గవర్నమెంట్ ను విమర్శిస్తూ ఆయన ముప్పై మూడు పేజీల రిపోర్టులో 9 ముఖ్యమైన అంశాల గురించి ప్రస్తావించారు.

నిర్మాణాల విభాగంలో జగన్ చేపట్టిన ఇసుక పాలసీ వల్ల ఎంతోమంది లేబర్ నష్టపోయారని అసలు వారి కష్టాలు ప్రభుత్వం దాకా వెళ్లాయో లేదో తెలియట్లేదని అని ఆయన ఘాటుగా విమర్శించాడు. జగన్ ప్రభుత్వంలోని పారదర్శకత లోపం వల్లే ఇలాంటివి తరచుగా జరుగుతున్నాయని  పవన్ అభిప్రాయపడ్డాడు. అలాగే అతను ముందుగా చూపించిన మేనిఫెస్టోకి... అతని పాలనలో ఎలాంటి సంబంధం లేదని…. రాజకీయ విలువలల మరియు సామాజిక న్యాయం అందులో పూర్తిగా లోపించాయని ఆయన అన్నాడు. 

ఇకపోతే గ్రామ వాలంటీర్లను చూస్తుంటే జగన్ భవిష్యత్తులో రాబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచే కార్యాచరణ మొదలుపెట్టినట్టు ఉందని అన్నాడు. ఏపీ గ్రామ వాలంటీర్లు చివరికి వైఎస్ఆర్సిపి పార్టీ కే చేటని ఆయన అభిప్రాయపడ్డాడు. తెలుగుదేశం పార్టీ చేపట్టిన జన్మభూమి కమిటీల లాగానే వచ్చే ఎన్నికల్లో గ్రామ వాలంటీర్లు వైసిపి పార్టీకి తీవ్ర చేటు చేస్తారని పవన్ భవిష్యవాణి చెప్పాడు. ఇలా జగన్ పాలన పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన పవన్ కళ్యాణ్ మాటలకు సీఎం ఇలాంటి బదులిస్తాడు చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: