గత కొన్ని రోజులుగా ఇండియా పాక్ బోర్డర్లో పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. ఆర్టికల్ 370 రద్దు తరువాత పాకిస్తాన్ బోర్డర్ లో రెచ్చిపోయి కాల్పులు జరుపుతున్నది.  కాల్పుల ఉల్లంఘనను పక్కన పెట్టి పాకిస్తాన్ కాల్పులు జరుపుతుండటంతో ఇండియా సమర్ధవంతంగా తిప్పికొడుతున్న సంగతి తెలిసిందే.  కాగా, ఇటీవలే బోర్డర్ లో పాక్ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడి కాల్పులు జరిపిన సమయంలో ఇండియా ఎదురు కాల్పులు జరిపింది.  


ఈ దాడిలో పాక్ కు చెందిన ఇద్దరు సైనికులు మరణించారు.  మొదట కాల్పుల్లో ఒక జవాను మరణించగా.. పాక్ ఎలాంటి తెల్లజెండాలు తీసుకురాకుండా దూకుడు ప్రదర్శిస్తూ కాల్పులు జరిపింది.  ఇండియా కూడా ఎక్కడా తగ్గలేదు.  అదే తీరుగా ఎదురు కాల్పులు జరపడంతో పాక్ జవాన్ మరొకరు మరణించారు.  గతంలో ఇలానే జరిగిన ఎదురు కాల్పుల్లో పాక్ కు చెందిన 7 మంది జవాన్లు మరణిస్తే..వారు మా సైనికులు కాదని చెప్పి సైలెంట్ గా ఉండిపోయింది.  


అయితే, ఇప్పుడు పాకిస్తాన్ సైనికులు తెల్లజెండాలు తీసుకొని వచ్చి వాళ్ళ సైనికులను తీసుకొని వెళ్లారు.  ఈ దృశ్యాలను ఇండియా ఆర్మీ రిలీజ్ చేసింది.  తెల్లజెండాలతో వచ్చినపుడు భారత సైన్యం ఎలాంటి కాల్పులు జరపలేదు.  అది యుద్ధనీతి కాదు.  తెల్లజెండాలు తీసుకొచ్చి సైనికుల మృతదేహాలను తీసుకెళ్లాలని సైన్యం పేర్కొన్న సంగతి తెలిసిందే.  తెల్లజెండాలను తీసుకొని వచ్చి పాక్ కు చెందిన ఇద్దరు సైనికులను తీసుకెళ్లారు.  


ఈ సంఘటనను బట్టి అర్ధం చేసుకోవచ్చు.. పాకిస్తాన్ ఎన్నిసార్లు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడిందో.. పాల్పడుతున్నదో... కానీ, కొన్నేళ్ల క్రితం వరకు పాక్ చెప్పిన మాటలను చైనాతో  పాటు  అమెరికా కూడా విన్నది.  ఎప్పుడైతే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చారో అప్పటి నుంచి స్వరూపం మొత్తం మారిపోయింది.  పాక్ చెప్పే కట్టుకథలు నమ్మడం లేదు.  ఆ దేశంలోనే ఉగ్రవాదులు ఉన్నారనే సంగతి అమెరికాకు తెలుసు.  
ఉగ్రవాద నిర్మూలన కోసం పాక్ కు ధనసహాయం చేస్తూ వస్తున్నది పాక్. 

కానీ, పాక్ ఆ నిధులను వేరే అవసరాలను వినియోగించుకుంటూ.. ఉగ్రవాదులను పెంచి పోషిస్తోంది.  ఉగ్రవాదుల శిక్షణ కోసం ఆ నిధులను కేటాయించింది.  ఈ విషయాన్ని పాక్ స్వయంగా ఒప్పుకుంది.  ఇదొక్కటి చాలు పాక్ చేస్తున్న కుతంత్రాల గురించి చెప్పడానికి.  పైగా నిన్నటి రోజున పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కాశ్మీరీలు ఆయుధాలు పట్టి ఇండియాపై తిరగబడాలని చెప్పడం చూస్తుంటే.. అయన ప్రధాని హోదాలో ఉండాల్సిన వ్యక్తేనా అనే సందేహం కలుగుతుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: