ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పొందిన విషయం తెలిసిందే. రాజకీయ విశ్లేషకులు కూడా తెలుగుదేశం పార్టీ కేవలం 23 ఎమ్మెల్యే, 3 ఎంపీ సీట్లు మాత్రమే వస్తాయని అంచనా వేయలేకపోయారు. ఎన్నికల ఫలితాల తరువాత తెలుగుదేశం పార్టీలోని ముఖ్య నేతలు బీజేపీ పార్టీ వైపు చూస్తున్నారు. గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ నుండి బీజేపీ పార్టీకి వలసలు కొనసాగుతున్నాయి. 
 
2024 సంవత్సరంలోపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలోపేతం కావటమే లక్ష్యంగా బీజేపీ పార్టీ కూడా ఇతర పార్టీల నుండి వచ్చే నాయకుల్ని చేర్చుకుంటోంది. వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ అయిన జేసీ దివాకర్ రెడ్డి బీజేపీ పార్టీపై చేసిన వ్యాఖ్యల్ని చూస్తుంటే జేసీ త్వరలోనే బీజేపీ పార్టీలో చేరేలా ఉన్నాడని తెలుస్తోంది. జేసీ దివాకర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ ప్రభంజనం మొదలైందని వ్యాఖ్యలు చేశారు. 
 
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వలనే టీడీపీ పార్టీ నుండి బీజేపీ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయని  అన్నారు. చంద్రబాబు ఆలోచనలపైనే బీజేపీ పార్టీ ఆధారపడి ఉందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచనలపైనే ప్రాంతీయ పార్టీలన్నీ ఆధారపడి ఉన్నాయన్నారు. ప్రధాని మోడీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చంద్రబాబు నాయుడు తప్పుడు నిర్ణయాలు వలసలకు కారణమని వ్యాఖ్యలు చేశారు. 
 
తెలుగుదేశం పార్టీ నుండి బీజేపీ పార్టీలోకి ఇప్పటికే నలుగురు ఎంపీలు జంప్ చేశారు. ప్రస్తుతం జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే జేసీ కూడా త్వరలోనే బీజేపీ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు అర్థమవుతుంది. జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. తెలుగుదేశం పార్టీ నుండి మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి బీజేపీ పార్టీలో చేరుతుండగా జేసీ కూడా త్వరలోనే పార్టీ మారే అవకాశం ఉందని చెప్పవచ్చు. 



మరింత సమాచారం తెలుసుకోండి: