ఆంధ్ర ప్రదేశ్ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వంద రోజుల పాలనా పూర్తి చేసుకొని 10 రోజులు అయ్యింది. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ఈరోజే 100 రోజులు అయినట్టుంది. అందుకే ఈరోజు అమరావతిలో జగన్ 100 రోజుల పాలనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టాడు. అది పెట్టాడు.. మాట్లాడాడు.. ఒక్క మాట కూడా జనసేన అధినేతల మాట్లాడలేదు అని అంటున్నారు నెటిజన్లు. 


మాటలన్నీ పచ్చ పార్టీ మాటలే.. పచ్చ పార్టీ ఎం అంటే జనసేన కూడా అదే అంటున్నాడు. జనసేన అధినేత మాటలు వింటే పవన్ మాట్లాడుతున్నట్టు లేదు.. టీడీపీ నేతల్లో ఒకరు మాట్లాడుతున్నట్టు ఉంది అని అంటున్నారు. అయితే రాజధానిపై సరైన నిర్ణయం లేదని, రాజధాని విషయంపై తేల్చి చెప్పాలని రాజధాని కోసం అతను దీక్ష చేస్తున్నట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి.. 


దీంతో ఆగ్రహానికి గురైన ఆంధ్ర ప్రజలు కొంతమంది సోషల్ మీడియాలో స్పందిస్తూ 'ఏంటి పవన్ బాబు నీ బాధ చెప్పు.. అసలు ఇప్పుడు నువ్వు దీక్ష చెయ్యాల్సిన అవసరం ఏముంది ? ప్రజలకు  జగన్ పాలన మొదలై కేవలం 3నెలలో ఏం అన్యాయం జరిగిందో చెప్పండి. మీరంతకు మీరు ఆలా ఇబ్బంది పడుతున్నారు.. ఇలా ఇబ్బంది పడుతున్నారు అని రాస్తున్నారు. 


అసలు ఏమి ఇబ్బంది వచ్చింది ప్రజలకు.. చెప్పండి అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇలా ప్రశ్నిస్తూనే జగన్ పాలన మొదలై కేవలం 3నెలలే అయ్యింది. అప్పుడే ఇంత రగదంతం చేస్తున్నారు. ఏ ప్రభుత్వానికి అయినా కనీసం ఆరు నెలలు గడువు ఇవ్వాలని ముందు తెలుసుకోండి. తర్వాత ఏదైనా చెయ్యండి. మొన్నటివరకు చంద్రబాబు 'చలో ఆత్మకూరు' అంటూ రాష్ట్రంలో అల్లర్లు సృష్టించారు. 
ఇప్పుడు 'చలో అమరావతి' అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టి అల్లరి చేస్తున్నాడు. ఇద్దరికిద్దరు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా దించాలని ప్రయత్నిస్తున్నారు అంటూ ప్రజలు ఫైర్ అవుతున్నారు. ఎవరు ఎలాంటి ప్లాన్లు వేసిన, ఎంత రాజకీయం చేసిన జగన్ పాలన అద్భుతం అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. 



మరింత సమాచారం తెలుసుకోండి: