తిరుమల తిరుపతి దేవస్ధానం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఇంటికి అఘోరాలు వచ్చారు. విజయవాడలోని వైవి ఇంటికి హిమాలయాల నుండి వచ్చిన అఘోరాలు రావటం సంచలనంగా మారింది. మామూలుగా అఘోరాలంటే సమాజంలో పాజిటివ్ అభిప్రాయమైతే లేవు. అఘోరాలపై సమాజంలో రకరకాల అభిప్రాయాలున్నాయి. దానికి తోడు సినిమాల్లో కూడా వారిని నెగిటివ్ గానే చూపిస్తుండటంతో అఘోరాలంటే మామూలు జనాలైతే దూరంగానే ఉంటారు.

 

మామూలుగా అఘోరాలు కుంభమేళాలో మాత్రమే జనసామాన్యానికి కనబడతారు. మిగితా రోజుల్లో వారి దర్శనం మామూలు జనాలకు దొరకటం కష్టమనే చెప్పాలి. వీరిలో ఎక్కువమంది హిమాలయాల్లోనే లేకపోతే కొండ కొనల్లోనో ఉంటారు. కాశీ లాంటి పుణ్యక్షేత్రాల్లో కూడా సశ్మానాల్లోనే ఎక్కువుగా ఉంటారని అంటారు. ఉత్తరాధి ప్రాంతాలను వదిలిపెడితే ధక్షిణాది రాష్ట్రాలకు అఘోరల పరిచయం తక్కువనే చెప్పాలి.

 

అలాంటి అఘోరాలు ఏకంగా వైవి సుబ్బారెడ్డి ఇంటికే వచ్చారంటే రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారకుండా ఉంటుంది. వైవి ఇంట్లో కాసేపు బస చేసిన అఘోరా సాధువులు వైవి కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. అదే సమయంలో రాజకీయ వర్గాల్లో నెగిటివ్ టాక్ కూడా మొదలైంది. ఈ అఘోరాలు అసలు రాష్ట్రానికి ఎందుకు వచ్చారు ? ఎక్కడ బస చేశారు ? వైవి ఇంటికి వచ్చి ఏమి చేశారు ? అన్నది ఇపుడు పెద్ద ప్రశ్నలుగా మారింది.

 

తిరుమల తిరుపతి దేవస్ధానం ట్రస్టుబోర్డు ఛైర్మన్ గా ఉన్న వైవికి అసలు అఘోరాలతో ఏమి పనిపడిందో ఎవరికీ తెలియటం లేదు. ఇంట్లో ఏదైనా పూజలు, అభిషేకాలు చేసుకుంటే మామూలుగా పంతుళ్ళను పిలిపించుకుంటారు. లేకపోతే ఏదైనా దేవాలయాలకు వెళ్ళి పూజలు, అభిషేకాలు చేయించుకోవటం అందరికీ తెలిసిందే. కానీ ప్రత్యేకంగా అఘోరాలు రావటమంటే మామూలు విషయం కాదు. ఉత్తినే వాళ్ళు వైవి ఇంటికి వచ్చారన్నా దాన్ని ఎవరూ నమ్మే పరిస్ధితి లేదన్నది నిజం.


మరింత సమాచారం తెలుసుకోండి: