చంద్రయాన్ -2 ప్రయోగం క్లైమాక్స్ జరిగి అపుడే వారం పైదాటింది. విక్రం ల్యాండర్ ఈ నెల 6న తెల్లవారుజామున చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండ్ కావాల్సింది ఆఖరు నిముషంలో సిగ్న‌ల్స్ కట్ అయి ఎక్కడ పడిందో అక్కడే ఉండిపోయింది.  నాటి నుంచి సిగ్నల్స్ పంపేందుకు ఇస్రో చేయని ప్రయత్నం లేదు. ఇస్రో రెండు రోజుల వ్యవధిలో విక్రం ల్యాండర్ ఆచూకి అయితే కనుగొంది కానీ సిగ్నల్స్ పంపినా స్పందించలేని స్థితిలో విక్రం లేకపోవడంతో అంతకంతకు ఆందోళన పెరిగిపోతోంది.


విక్రం ల్యాండర్ కు అమర్చిన బ్యాటారీలు రీచర్జబుల్ గా ఉంటాయి. వాటికి సౌర శక్తి నుంచి చార్జి చేసుకునేలా అమర్చారు. అయితే చార్జింగ్ కి  కూడా ఇస్రో సిగ్నల్స్ పంపాల్సిఉంటుంది. మరి పంపిన సిగ్నల్స్ కి విక్రం కనీసమాత్రంగా స్పందించకపోవడంతో బ్యాడ్ న్యూస్ అంటున్నారు. ఇస్రోకు సహాయకారిగా నాసా కూడా తమ ప్రయత్నాలు చేస్తోంది. నాసా సైతం డీప్ స్పేస్ యాంటెన్నాలతో ప్రయత్నించినా  కూడా విక్రం రియాక్ట్ కాకపోవడంతో ఇక ఆశలు వదిలేసుకోవాల్సిందేనా అన్న చర్చ సాగుతోంది.


మరో వైపు విక్రం ల్యాండర్ కి అమర్చిన బ్యాటరీలు కూడా ఇన్ని రోజులు రీచార్జి లేకుండా ఉండవని అంటున్నారు.  విక్రం రీచార్జ్ అవుతేనే తప్ప సిగ్నల్స్ కి కూడా ఇకపై అవకాశం ఉండదు, రీచార్జి కావాలన్నా ఇస్రో సిగ్నల్స్ మొదట స్వీకరించాలి. మరి  ఈ విధంగా విక్రం కధ ఉంటే మాత్రం ఇక బ్యాడ్ న్యూస్ చెప్తునట్లేనని అంటున్నారు. మొత్తానికి  యావత్తు భారతాన్ని ఓ కుదుపు కుదిపి ఆసక్తిని పెంచిన విక్రం ల్యాండర్  చివరికి ఇలా చంధ్రున్ని చేరకుండా వుండిపోవడం కొంత బాధాకరమే. అయినా ఇస్రో ప్రయత్నాలను మాత్రం అంతా అభినందిస్తున్నారు. ఎనీ హౌ అల్ ద్ బెస్ట్ ఇస్రో


       


మరింత సమాచారం తెలుసుకోండి: