శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో జరిగిందని చెప్పుకుంటున్న ఈ ఘటన హృదయాలను తీవ్రంగా కలచివేసేలాగా ఉంది. రాష్ట్ర రాజకీయాలను విశ్వవిద్యాలయాల వరకు తీసుకెళ్తున్న తీరు అయితే చాలా దయనీయం. ఎంతో గొప్ప చరిత్ర కలిగిన శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రిజిస్త్రార్ మరియు ఇంచార్జ్ మరియు రిజిస్టర్ వ్యవహరిస్తున్న తీరు చాలా ఘోరంగా ఉందట. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అనేకానేక సాంకేతిక సర్వీసులను అందిస్తున్న ఒక ప్రతినిధిని వారు పిలిచి హింసించిన తీరు గురించి యూనివర్సిటీ లోని జనాలే చాలా పేలవంగా మాట్లాడుకుంటున్నారు.

ఇన్చార్జి, రిజిస్త్రార్ టార్చర్ పెట్టిన ఆ ప్రతినిధి వికలాంగుడు కావడం అలాగే దాదాపు అతను అందిస్తున్న సాంకేతిక సర్వీసులు గురించి ఏమాత్రం అవగాహన లేని ఆరు నుంచి పది మంది ఉపాధ్యాయులు అతనిని వికలాంగుడు అనే కనీస విచక్షణ జ్ఞానం కూడా లేకుండా మాటల దాడితో కించపరుస్తూ కేవలం ఒకే ఒక్క సంతకం కోసం అతనిని ఒక గదిలో నిర్బంధించారట. సాక్షాత్తు ఇన్చార్జి రిజిస్త్రార్ మీటింగ్ కు అని రిజిస్త్రార్ ఆఫీస్ కు రమ్మని పిలిచి అతనిని తీవ్ర ఇబ్బందులకు గురి చేసి మరీ సంతకం పెట్టించుకున్నారట.

ముందు అతను మీకు ఏదైనా విషయాలపైన సందేహాలుంటే అధికారికంగా మాకు తెలియపరిస్తే మా సాంకేతిక విభాగం మరియు న్యాయ బృందం మా కంపెనీ వాదనను మీకు అధికారికంగానే తెలియజేసి సందేహాలను నివృత్తి చేస్తారు కానీ ఇలా తనతో బలవంతంగా పని చేయించుకోవడం తగదని వాదించాడట. తర్వాత వాళ్లు పెట్టిన మానసిక క్షోభను తాళలేక చివరికి వికలాంగుడిని కనీస కనికరం చూపకుండా వారు చేసిన దానిని భరించలేక నరక వేదన అనుభవిస్తూనే సంతకం పెట్టి బయటికి వచ్చాడట. చివరికి ఇదంతా ఎందుకంటే ఆ కంపెనీ వైఎస్సార్సీపీ సానుభూతిపరులదని వారిలో బలహీనుడైన ఒక ప్రతినిధిని టార్గెట్ చేసి మరీ ఇలా తమ పని చేయించుకొని రాజకీయ కక్ష కూడా తీసుకున్నారని అంటున్నారు. దేవాలయం లాంటి విద్యాలయంలో ఇలా రాజకీయాలకి పాల్పడుతున్న వారిని ఏమనాలి? మీరే చెప్పండి.


మరింత సమాచారం తెలుసుకోండి: