శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, ఏంటి నీకు అక్కడ సీటు దొరికిందా .. నీ లైఫ్ అద్భుతంగా ఉంటుంది పో. అని అంటారు ఆ యూనివర్సిటీ గురించి తెలిసిన వాళ్ళు. అంతటి గొప్ప చరిత్ర ఉంది ఆ యూనివర్సిటీకి. 65 సంవత్సరలు ఘన చరిత్ర కలిగిన యూనివర్సిటీ, ప్రకాశం పంతులు గారు, నీలం సంజీవ రెడ్డి గారి వంటి మహామహుల చేతుల మీదుగా 1954 లో ప్రారంభించబడి ఎందరో మహానుభావులను జాతికి అందించిన ఘన చరిత్ర కలిగిన యూనివర్సిటీ అది. 


రాయలసీమ, నెల్లూరు వాసులందరికీ ముఖ్యంగా యువతకు ఉపయోగ పడుతున్న ఘన విశ్వ విద్యాలయం 'ఎస్వీయూ'. అలాంటి యూనివర్సిటీలో ఘోరం చోటు చేసుకుంది. ఎస్వీ యూనివర్సిటీని కించపరిచే విధంగా ఉంది ప్రస్తుత ఇంచార్జి రిజిస్టర్ వ్యవహరిస్తున్న తీరు. ఓ వికలాంగ ప్రతినిధిని దాదాపు 30నిమిషాల పాటు నిర్బంధించి మాటల దాడి, హావ భావాలతో ఆ వికలాంగుడిని మానసికంగా ఇబ్బంది పెట్టారట. 


ఎస్వీయూకి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద పలు సాంకేతిక సర్వీసులని అందిస్తున్న కంపెనీ ప్రతినిధిని సాక్షాత్తు ఇంచార్జి రిజిస్ట్రార్ మీటింగ్ కు రిజిస్ట్రార్ ఆఫీస్ కు రమ్మని పిలిచి ఆ కంపెనీ వారు అనుభవం, సంబంధం లేని దాదాపు 6 - 10 సభ్యులు వికలాంగుడనే విచక్షణ జ్ఞానం లేకుండా మాటల దాడి, హావ భావాల దాడి చేసి ఆ వికలాంగా ప్రతినిధితో వారికీ కావలసిన డాక్యూమెంట్లపై సంతకం పెట్టించుకుని వదిలేశారట. 


అయితే ఈ ఘటన గురించి విన్న ప్రజలు, ఎస్వీయు విద్యార్థులు, ఉద్యోగులు ఎందుకు ఇంత దారుణంగా ప్రవర్తించారు. గొప్ప చరిత్ర ఉన్న ఈ విశ్వా విద్యాలయంలో ఇలా జరగడం ఏంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారట. ఎస్వీయూ నీకు ఇది న్యాయమా అంటూ ప్రశ్నిస్తున్నారట.. 'ఏది ఏమైనా ఒక వికలాంగ ప్రతినిధి పట్ల ఆలా వ్యవహరించడం కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటె అధికారకంగా మాట్లాడుకోవాలి కానీ వికలాంగుడని, అతని లోపాన్ని ఎత్తి చూపి బాధ పెట్టకూడదు' అని అంటున్నారు నెటిజన్లు. 



మరింత సమాచారం తెలుసుకోండి: