అధికారం చేతిలో ఉందని కొంతమంది చేసే పనులకు అడ్దూ అదుపూ ఉండదు. అలాంటి సంఘటనే ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో చోటు చేసుకుందట. దాదాపు 65 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ విశ్వవిద్యాలయం లో ఇలాంటి ఒక సంఘటన జరిగిందన్న వార్తలు రావడం చాలా దురదృష్టకరం. అదీ కాకుండా దీనిని చేసింది ప్రస్తుత ఇంచార్జి మరియు రిజిస్ట్రార్ అట. ఎంతో గొప్ప చరిత్ర కలిగిన విశ్వవిద్యాలయం పేరుని కించపరిచే విధంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ కింద పలు సాంకేతిక సర్వీసులను అందిస్తున్న ఒక కంపెనీ ప్రతినిధితో వారి వ్యవహరించిన తీరు చాలా విషాదకరం.

వికలాంగుడైన ఆ కంపెనీ ప్రతినిధిని మీటింగ్ ఉందని రిజిస్త్రార్ ఆఫీస్ కి పిలిచి ఆ కంపెనీ చేస్తున్న పని గురించి ఏమాత్రం అవగాహన గాని అనుభవము గాని సంబంధము లేని పదిమంది సభ్యులు అతనిని గదిలో నిర్బంధించి మానసికంగా హింసించారట. మీరు ఏ విషయాలైనా మాకు అధికారంగా తెలియజేస్తే... మేము కూడా మా సాంకేతిక బృందంతో కలిసి మా కంపెనీ వాదన మీకు అధికారికంగా తెలియజేస్తామని మాట్లాడిన వికలాంగ ప్రతినిధిని వారు తీవ్ర ఇబ్బందికి గురి చేశారట.

దాదాపు ముప్పై నిమిషాల పాటు అతనిని నిర్బంధించి తమకు కావాల్సిన డాక్యుమెంట్లు పై సంతకం పెట్టించుకొని కానీ వదలలేదట. తనకి సంతకం చేయడం ఇష్టం లేదని... ఏదైనా అధికారికంగా మరియు న్యాయంగానే తేల్చుకుందామని అతను అంటున్న కూడా సాక్షాత్తు రిజిస్త్రార్ మరియు ఇన్చార్జి అధికార బలంతో ఇటువంటి నీచమైన పంచాయతీలకు తెర తీశారట. తీరా విషయం ఏమిటంటే.... ఆ కంపెనీ అధికార పార్టీ సానుభూతిపరులకు చెందినది కావడం ఇంకా రిజిస్టర్ ఇంతకు ముందు అధికారంలో ఉన్న పార్టీ యొక్క అజెండాను తమ భుజస్కందాలపై ఇప్పటికీ మోస్తూ ఇలాంటి ఎన్నో ఆక్రుత్యాలకు పాల్పడుతున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై నేరుగా ముఖ్యమంత్రి గారే కలగజేసుకుని పరిస్థితి చక్కదిద్దేదాకా ఇలాంటి వాళ్లు మారరు.


మరింత సమాచారం తెలుసుకోండి: