విద్య నేర్వని వాడు వింత ప.. అనే నానుడి ఉంది. విద్య నేర్చుకుని ఆ విద్యను పది మందికి పంచేవాడే వింత చేష్టలు చేసేవాళ్లు ఆ కోవలోకే వస్తారు. నిస్సహాయుడైన ఓ వికలాంగుడిపై వికృత చేష్టలు చేస్తుంటే ఆచార్యులు అనే గౌరవనామనికే తలవంపులు తెచ్చినట్టే. సాక్షాత్తూ ఓ రిజిస్ట్రారే ఇంతకు బరి తెగిస్తే నిస్సహాయంగా ఉండిపోవడం తప్ప చేయగలిగేదేంటి!

 

 

 

అత్యంత పేరు ప్రతిష్టలు కలిగిన విశ్వవిద్యాలయాల్లో ఒకటైన తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఓ దాష్టీకం జరిగిందని సమాచారం. ఈ యూనివర్సిటీకి సాంకేతికంగా పలు సేవలందిస్తున్న ఓ కంపెనీ ప్రతినిధిని తన ఛాంబర్ కే పిలిపించి మానసిక దాడికి పాల్పడటం విద్యావ్యవస్థకే మాయని మచ్చని అక్కడి సిబ్బందే అనుకుంటున్నారట. నిశ్శహాయుడని తెలిసి కూడా సదరు రిజిస్ట్రార్ తన సిబ్బంది చేత దాడి చేయించడం ఎంతవరకూ సబబని వాపోతున్నారట. రెండేళ్లకు మునుపు ఇదే యూనివర్సిటీలో జరిగిన అవకతవకలు మారువకముందే ఇంత దూరగతమా అని సహచర ప్రొఫెసర్లు ముక్కుమీద వేలేసుకున్నారట. సదరు కంపెనీపై రాజకీయ మచ్చలు వేస్తున్నారని కూడా వాపోతున్నారట. గత ప్రభుత్వ హయాంలో  కీలక పోస్టు పొందిన ఈ రిజిస్ట్రార్ ఇంకా ఆయనపై కృతజ్ఞతాభావంతో మెలుగుతున్నాడని గుసాగుసలు వినిపిస్తున్నాయట. విద్యార్థులు రాజకీయాలు చేయకుండా చూడాల్సిన బాధ్యతాయుత పదవికి మచ్చ తేవడం అక్కడివారు జీర్ణించుకోలేకపోతున్నారట. యూనివర్సిటీలో గురువే నీచ రాజకీయాలకు పాల్పడటం అక్కడి విద్యార్థులు, ప్రొఫెసర్లనే ఆశ్చర్యానికి గురి చెస్తోందట.

 

 

 

సినిమాలో చూపినట్టు ఆఫీస్ కే పిలిచి వికలాంగుడిపై దాడి చేయటం చూసి విద్యార్థులే 'మాకూ.. గురువుకు తేడా ఏంటి' అని ముక్కుమీద వేలేసుకుంటున్నారట. రూమ్ లో పరిస్థితి చూసి చేయాల్సిన దానిని రాసిస్తే వివరణ ఇస్తామని నిస్సహాయంగా చెప్పినా దాడి చెయ్యడంపై విమర్శలు వస్తున్నాయట. మానవత్వం గురించిన పాఠం సదరు రిజిస్ట్రార్ కి అంత చదువులో నేర్చుకోలేకపోవడం చూసి వింత ప..వు అనక ఇంకేమనాలి అంటూ అసహ్యించుకుంటున్నారట విద్యార్థులు.

మరింత సమాచారం తెలుసుకోండి: