విశ్వవిద్యాలయాలు ఇప్పుడు తప్పు దోవపడుతున్నాయి.  ఒకప్పుడు విద్యను బోధిస్తూ అందరికి ఆదర్శంగా నిలిచే విశ్వవిద్యాలయాలు నేడు విద్యలేని ఆలయంగా, రౌడీ మూకలకు గమ్యస్థానాలుగా మారుతున్నాయి.  విశ్వవిద్యాలయంలో చదువుకునే విద్యార్థులు అందరు అలా ఉంటారు అని కాదు.  వారిని పక్కదోవ పట్టించే  వ్యక్తులు ఎక్కువగా అక్కడ ఉంటారు.  విద్యార్థుల చదువుకు భంగం కలిగిస్తూ.. వారిని నిత్యం వేధించే వ్యక్తులు ఎక్కువగా కనిపిస్తుంటారు.  వీరి నుంచి విద్యార్థులు రక్షింపబడాలి అంటే ఏం చేయాలి.  


విశ్వవిద్యాలయాల్లో చదివే విద్యార్థులు పైకి చెప్పుకోవడం లేదుగాని.. లోపల చాలా ఇబ్బందులు పడుతున్నారు.  సరైన వసతులు ఇబ్బందులు పడుతున్నారు.  కనీస సౌకర్యాలు కూడా పాపం విశ్వవిద్యాలయాల్లో ఉండటం లేదు.  తమను తాము రక్షించుకునే మార్గాలు లేక ఎదో చదువు పూర్తయితే చాలు అని అవమామను భరిస్తూ.. చదువుకునే విద్యార్థులు విశ్వవిద్యాలయాల్లో ఉన్నారు.  నోరు విప్పి చెప్పుకోలేని పరిస్థితుల్లో విద్యార్థులు ఉంటున్నారు అంటే దానికి కారకులు ఎవరు.  విశ్వవిద్యాలయాల్లో గొడవలు జరుగుతున్నాయి అంటే దానికి బాధ్యలు ఎవరు.  


విద్యను బోధించే ఉపాధ్యాయులు కూడా విద్యార్థులు పడుతున్న పరిస్థితుల గురించి చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి.   ధైర్యం చేసి బాధల గురించి చెప్తే ఏమౌతుందో అని భయం వారిలో నెలకొన్నది.  అందుకే ఉపాధ్యాయులు కూడా కామ్ గా ఉంటున్నారట.  ఈ పరిస్థితులు పోవాలంటే, యూనివర్శిటీలోని సమస్యల పరిష్కారం కావాలంటే.. ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగాలని విద్యార్థులు కోరుకుతున్నారట.  ముఖ్యమంత్రి తలచుకుంటూనే యూనివర్శిటీలో సమస్యలు పరిష్కారం అవుతాయని, అన్ని చక్కదిద్దుకుంటాయని అక్కడి విద్యార్థులు చెప్తున్నారు. మరి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాయలసీమలో ఉన్న కృష్ణదేవరాయ  విశ్వవిద్యాలయంపై ఒకసారి దృష్టి సారిస్తే.. అక్కడి సమస్యలు సద్దుమణుగుతాయి. ముఖ్యమంత్రి జగన్ వీలు చూసుకొని రాయలసీమలోని విశ్వవిద్యాలయాన్ని ఒకసారి సందరర్శించాలని.. అక్కడి విద్యార్థులు కోరుకుంటున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: