దివ్యాంగుల ను మాటలతో కానీ చేతలతో కానీ వేధించడం  అంటే చట్టరీత్యా నేరమే... దానికి నాన్ బెయిలబుల్  సెక్షన్ల కింద నిందితులపై కేసు నమోదు చేసి పోలీసులు అరెస్టు చేయవచ్చు.  తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ లో ఒక దివ్యాంగున్ని ఇంచార్జి రిజిస్ట్రార్  ఆయన సహచరులు అరగంటపాటు నిర్బంధించి తమకు అనుకూలమైన పత్రాలపై సంతకాలు చేయించుకున్న సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  ఇంత జరిగినా ఎస్వీ యూనివర్సిటీ  ఇంచార్జి రిజిస్ట్రార్  పై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.  ఒక దివ్యాంగున్ని అరగంటపాటు నిర్బంధించి తమ మాటలతో,  చేతలతో వేధించడం అంటే అది చట్టరీత్యా నేరం కాదా ? అంటూ నెటిజన్లు  ప్రశ్నిస్తున్నారు.


అటువంటప్పుడు ఇంచార్జి రిజిస్ట్రార్, ఆయనకు మద్దతుగా నిలిచి దివ్యాంగున్ని వేధించిన వారిపై పోలీసులు  కేసు నమోదు చేయాల్సిందే కదా ? అంటూ నిలదీస్తున్నారు .  చుట్టాలేమైనా వారికి చుట్టమా అంటున్న నెటిజన్లు ...  ఉన్నత పదవుల్లో ఉన్న వారే ఈ విధంగా వ్యవహరించడం ద్వారా విద్యార్థులకు ఎటువంటి సంకేతాలను పంపిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఎస్వీ యూనివర్సిటీ కి  కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సి ఎస్ ఆర్ ) కింద ఒక సంస్థ సాంకేతిక సహకారాన్ని అందిస్తోంది . అయితే సదరు సంస్థ ప్రతినిధిని తన చాంబర్ కు  పిలిపించుకున్న  ఇంచార్జి రిజిస్ట్రార్ ,  ఆయన సహచరులు సూటిపోటి మాటలతో వేధించడమే కాకుండా తమ హావభావాలతో వేధింపులకు  గురి చేసినట్లు తెలుస్తోంది . అయితే ఆ వ్యక్తి దివ్యాంగుడు కావడంతో  తాను నిల్చో లేనని కూడా చెప్పినప్పటికీ అతన్ని కూర్చోబెట్టకుండా, ఇష్టా రీతిలో ప్రశ్నలు వేస్తూ వేధించినట్లు సమాచారం .


సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సేవ చేస్తున్న సంస్థ ను  తప్పించడానికి ఇంచార్జి రిజిస్ట్రార్ ఈ విధంగా వ్యవహరించారేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయి . ఎందుకంటే సీఎస్ఆర్ కింద సేవలు అందించే సంస్థ ఎవరికీ,  ఎటువంటిఎటువంటి  కమిషన్లు ముట్టచెప్పాల్సిన అవసరం ఉండదు. తమకు కమిషన్లు దక్కాలంటే సి ఎస్ ఆర్ కింద సాంకేతిక సహకారం అందిస్తోన్న సంస్థ తప్పించి , తమకు అనుకూలమైన సంస్థ కు కాంట్రాక్టు కట్టబెట్టడానికి  ఈ విధంగా వ్యవహరించి ఉంటారన్న అనుమానాలు కలుగుతున్నాయి . 

మరింత సమాచారం తెలుసుకోండి: