భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా సేవా సప్తాహ పేరిట పలు ప్రజాహిత కార్యక్రమాలను నిర్వహించతలపెట్టారు. సెప్టెంబర్  20 వ తేదీ వరకు కొనసాగే ఈ సేవా సప్తాహ కార్యక్రమానికి శనివారం శ్రీకారం చుట్టారు. భారతీయ జనతా పార్టీ జాతీయ కమిటీ పిలుపు మేరకు ఈ కార్యక్రమాలకు దేశం నలుమూలల ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ క్రమంలో వాడ వాడల విస్తృత స్థాయిలో సేవ కార్యక్రమాలను చేపట్టేందుకు కమల దండు నడుంబిగించారు. ఇందులో భాగంగా 15 వ తేదీన భీంగల్ లో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు. అదే విధంగా నిజామాబాద్ బస్వా గార్డెన్స్ లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.16 వ తేదీన ఉదయం కాకతీయ ఇనిస్టిట్యూషన్ లోను, మధ్యాహ్నం జగిత్యాల చాణక్య స్కూల్ లో ప్లాస్టిక్ డిస్పోజల్ మీద అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. 



18 వ తేదీన మెట్పల్లి లో డాక్టర్ వెంకట్ ఆధ్వర్యంలో ఉచిత శస్త్ర చికిత్స కార్యక్ర మాన్ని ఏర్పాటు చేశారు. అర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. 19 వ తేదీన ఆర్మూర్ జిల్లా పరిషత్ హైస్కూల్ లో స్టేషనరీ వస్తువుల పంపిణీ వంటి కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఆయా  కార్యక్రమాలన్నింటిలో నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి పాల్గొననున్నట్టు పార్టీ శ్రేణులు పేర్కొంటున్నారు. 



అంతేకాకుండా సెప్టెంబర్ 17 తేదీన ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి ఆధ్వర్యంలో ఘనంగా సేవా సప్తాహ కార్యక్రమం చేపట్టేందుకు కమలనాధులు సమాయత్తమవుతున్నారు. ఇందులో భాగంగానే ఎంపీ అర్వింద్ శనివారం పలు సేవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో  డిచ్ పల్లి లోని మానవతా సదన్ లో 113 పిల్లలకు దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం పోచంపాడులోని శ్రీ గురుదత్త వాత్సల్య నిలయంలో దుప్పట్లను పంపిణీ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: