అగ్రరాజ్యం అమెరికా ఇరాక్ లో ఉన్న ఐఎస్ఎస్ శిబిరాలపై బాంబులు వేసి నాశనం చేసి నాలుగు రోజులు కూడా కాలేదు వెంటనే మరొక తీవ్రవాద సంస్థపై తన ప్రతాపం చూపించింది. ఈ సారి ఏకంగా ఒసామా బిన్ లాడెన్ కొడుకునే హతమార్చి అతని చావుని కూడా తన ఖాతాలో వేసుకుంది. బిన్ లాడెన్ కొడుకు, ఆల్ ఖైదా వారసుడైన హంజా బిన్ లాడెన్ ను అమెరికా కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్ లో హత మార్చేసింది. ఈ విషయాన్ని స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించాడు. అల్ ఖైదా సభ్యులలో ఎంతో ముఖ్యుడైన లాడెన్ కొడుకు, హంజా బిన్ లాడెన్ ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతం వద్ద చంపబడ్డాడని ట్రంప్ ఆఫీస్ నుండి జర్నలిస్టులకు శనివారం ఒక స్టేట్మెంట్ వెళ్ళింది.

చాలా ప్రమాదకరంగా మారుతున్న ఒసామా బిన్ లాడెన్ కొడుకు అయినా హంజా బిన్ లాడెన్ ను ఇప్పటివరకు చాలా టెర్రరిస్ట్ గ్రూపుల ప్లానింగ్ మరియు డీలింగ్ లో ముఖ్య పాత్ర వహించాడని వారు ఆరోపించారు. అతని తండ్రి లాగే అతను కూడా టెర్రరిస్టు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడని... అల్-ఖైదా లో తన నాయకత్వ లక్షణాలతో అచ్చం అతని తండ్రిలాగే ప్రవర్తిస్తున్నాడని అందుకే అతనిని చంపినట్లు వారు తెలిపారు. హంజా చావుకు సంబంధించి మొదట జూలైలోనే ఒక వైమానిక దాడిలో మరణించాడు అనే వార్తలు వచ్చాయి.

జూలైలోనే ట్రంప్ అతను తమ దేశానికి చాలా ప్రమాదకరంగా తయారయ్యాడు అని చెప్పాడే కానీ మిగతా విషయాలు ఏవీ వెల్లడించలేదు. ఇప్పటికీ అమెరికా ఆపరేషన్ ఎప్పుడు, ఎక్కడ చేసింది అన్న విషయంపై పూర్తి వివరాలు లేవు కానీ అతను చనిపోయిన విషయాన్ని మాత్రం వారు ధృవీకరించారు. హంజా చిట్టచివరిగా 2018 లో బహిరంగంగా ఒక స్టేట్మెంట్ విడుదల చేశాడు. అందులో సౌదీ అరేబియాను తీవ్రవాద దాడులతో అతలాకుతలం చేస్తామని.... సౌదీలో రాచరిక సంస్క్రతి నశించాలని అందులో రాసి ఉంది. అప్పటికే అతని ఆచూకీ తెలిపిన వారికి ఒక మిలియన్ డాలర్ల బహుమతిని కూడా ప్రకటించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: