విద్యలేని వాడు వింతపశువు అన్నారు.. మరి  విద్య వుండి కూడా సంస్కారహీనంగా ప్రవర్తించినవాళ్ళను ఏమనాలి ? పైగా  విద్యను బోధించువారే అత్యంత  నీచంగా ప్రవర్తిస్తే మరి వాళ్ళను ఏం చెయ్యాలి ?  పేరు పక్కన డిగ్రీలు సంపాదించారు గాని, విలువలతో బతకడం వాళ్ళు మరిచిపోయారు.  గొప్ప  ఘన చరిత్ర కలిగిన ఎస్వీయూలో సభ్యసమాజం సిగ్గు పడే  సంఘటన జరగడం బాధాకరం. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద పలు సాంకేతిక సర్వీసులని అందిస్తున్న ఓ కంపెనీ ప్రతినిధిని అత్యంత దారుణంగా అవమానపరిచారు. సాక్షాత్తు 'ఇంచార్జి రిజిస్ట్రార్ మీటింగ్'కు  రమ్మని పిలిచి,  దాదాపు 6 - 10  సభ్యులు ఆ కంపెనీ ప్రతినిధి వికలాంగుడనే విచక్షణ జ్ఞానం కూడా లేకుండా మాటల దాడి, హావ భావాలతో ఆ వికలాంగుడిని మానసికంగా ఇబ్బంది పెట్టారట. నిజంగా ఇది దారుణమే.  ప్రస్తుత ఇంచార్జి రిజిస్ట్రార్ వ్యవహరిస్తున్న తీరు ఏ మాత్రం సహించేవిధంగా లేదట. నన్ను ఇబ్బంది పెట్టడం మీకు న్యాయం  కాదని ఆ వికలాంగ ప్రతినిధి ఎన్ని రకాలుగా వేడుకున్నా  వాళ్ళు వినకుండా...  సుమారు ముప్పై నిముషముల పాటు.. మానసికంగా టార్చర్ పెట్టారట.  పైగా గదిలో నిర్బంధించి మరి.. ఆ వికలాంగ ప్రతినిధి చేత తమకు కావలసిన డాక్యూమెంట్ల పై సంతకం పెట్టించుకున్నారట.  ఆ వికలాంగ ప్రతినిధి తనకు సంతకం పెట్టె అధికారం లేదని,  తాను సంతకం చేయనని, సంతకం చేయడం తనకు ఇష్టం లేదని ఎంత ప్రాధేయపడినా వారు కనికరించలేదట. ఏమిటి ఈ దారుణం ?  65  సంవత్సరముల ఘన చరిత్ర కలిగిన యూనివర్సిటీలో ఇలాంటి సంఘటన జరగడం ఎవ్వరూ అంగీకరించలేనిది.  


ఎందరో మహానుభావులను జాతికి అందించిన  ఎస్వీయూలో  ఇటువంటి నడవడి అందులోనూ సాక్షాత్ రిజిస్ట్రార్ చాంబర్స్ లో జరగడం,  పైగా   ఒక వికలాంగుడి పై ఏకంగా  ఆరుగురు నుండి పది మంది వరకూ నీచంగా మాటల దాడి చేస్తూ, అవహేళనగా హావ భావ దాడితో  మానసికంగా హింసించడం సభ్య సమాజానికే సిగ్గు చేటు. ప్రకాశం పంతులుగారు, నీలం సంజీవ రెడ్డిగారి వంటి మహామహుల చేతుల మీదుగా ప్రారంభించిన ఈ గొప్ప  విశ్వ విద్యాలయంలో ఇకనుండైనా ఇలాంటివి జరగకుండా చెయ్యాలి.  ఇంతకీ ఆ  వికలాంగ ప్రతినిధిని ఎందుకు అవమానించారు అంటే..  ఈ వికలాంగ ప్రతినిధీ వైస్సార్సీపీ కు సంబంధించిన వారట. గత ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులే ఇలా చేశారని తెలుస్తోంది. మొత్తానికి  ఎస్వీయూ ఘోరంలో రాజకీయ కోణం ఉండటం విశ్వ విద్యాలయానికే అవమానకరం.  


మరింత సమాచారం తెలుసుకోండి: