మాట తప్పను..మడమ తిప్పను అంటూ అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అదే విధానంలో ముందుకెళుతున్నారు. అనుకున్నది సాధించడంలో ఎన్ని నష్టాలు ఉన్న...గమ్యం చేరడమే లక్ష్యంగా పయనిస్తున్నారు. తన పాదయాత్రలో మద్యం వలన ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయని గమనించిన జగన్..మద్యపాన నిషేధం చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే అధికారంలోకి రాగానే మద్యపాన నిషేధమే లక్ష్యంగా  ఆయన పని చేస్తున్నారు.


రాష్ట్రానికి అదే ముఖ్యమైన ఆదాయ వనరు అని అధికారులు చెప్పిన ఆడబిడ్డలకు ఇచ్చిన మాటకు కట్టుబడి నష్టమని తెలిసినా...అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే మద్యపాన నిషేధంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తున్నట్లు చెప్పి...దానికి ఓ పాలసీ కూడా రూపొందించారు. దశలవారీగా మద్య నిషేధంలో భాగంగా ఏటా 20శాతం షాపులను తగ్గించేందుకు నిర్ణయించారు. అలాగే మద్యం దుకాణాలని ప్రభుత్వమే నడిపేలా నిర్ణయం తీసుకున్నారు. పైగా అందులో నిరుద్యోగులకు ఉపయోగ పడే ఒక పని కూడా చేశారు.


వైన్ షాపుల్లో ఉద్యోగాలు కల్పించి ...నిరుద్యోగులకు మంచి జీతాలు వచ్చేలా ప్లాన్ చేశారు. అటు మద్యపాన నిషేధంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 4,380 మద్యం షాపులని 3,500కు తగ్గించారు. ఇప్పటికే తొలి విడతగా 500 వందల మద్యం షాపులను ప్రభుత్వం నిర్వహించడం సెప్టెంబర్ నుంచే ప్రారంభించారు. రెండో విడత మరో 3,000 షాపులను అక్టోబర్ 1వ తేదీ నుంచి నిర్వహించనున్నారు. అయితే మద్యం సేవించేవారిని తగ్గించాలని ఆలోచన కూడా చేసి...మద్యం బాటిళ్ళ రేట్లని పెంచడానికి సిద్ధమయ్యారు. అలా చేస్తే వారు కొనడానికి ఆలోచించి ఆగుతారని జగన్ యోచన చేశారు.


అటు మద్యం బ్రాండ్లని కూడా తగ్గించడానికి కూడా ప్రణాళిక రెడీ చేశారు. ఇలా తాను అధికారంలో ఉండే ఐదేళ్లలో దశలవారీగా మద్యం షాపులని, బ్రాండ్లని తగ్గిస్తూ వెళ్లనున్నారు. అలా చివరికి మద్యం అమ్మకాలని స్టార్ హోటళ్ళకే పరిమితం చేయనున్నారు. ఇలా చేస్తూ మద్యపాన నిషేధాన్ని విజయవంతంగా అమలు చేయనున్నారు. మొత్తం మీద ఈ వంద రోజుల పాలనలో మద్యపాన నిషేధం దిశగా జగన్ విజయవంతంగా అడుగులేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: