రాష్ట్రంలో సీఎం  వై.యస్.జగన్  చదువుతో పాటు క్రీడలకు పెద్ద పీట ఇస్తున్నారని తిరుపతి పార్లమెంటు సభ్యులు బల్లి దుర్గ ప్రసాద్ చెప్పారు.
శనివారం నెల్లూరు జిల్లా,పొదలకూరు మండలంలోని జెడ్.పి.హై స్కూల్ లో ఏర్పాటు చేసిన  రాష్ట్ర 5వ ఇంటర్ ఛాంపియన్ షిప్ బ్యాడ్మింటన్ పోటీలను మాజీ మంత్రి ,వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామ నారాయణ రెడ్డి, తిరుపతి ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ లతో కలిసి సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. ఈ  సందర్బంగా  క్రీడాకారుల నుండి గౌరవ వందనాన్నియం.పి. దుర్గా ప్రసాద్, ఎమ్మెల్యేలు ఆనం, కాకాణిలు స్వీకరించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ..పొదలకూరులో కాకాణి గోవర్ధన్ రెడ్డి చదువుకున్న పాఠశాలలో క్రీడోత్సవాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. క్రీడాకారుల ద్వారా క్రమశిక్షణతో పాటు తమ క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవాలన్నారు. గెలుపోటంలతో సంబంధం లేకుండా క్రీడా స్పూర్తితో ముందుకు వెళ్ళాలన్నారు.



పొదలకూరులో నిర్మించనున్న కొత్త స్టేడియంకు "కాకాణి రమణా రెడ్డి"  పేరును ఆనం రామ నారాయణ రెడ్డి గారు ప్రతిపాదించగా,  బల్లి దుర్గా ప్రసాద్  పేరు పెట్టేందుకు కృషి చేస్తామని ఎంపీ వెల్లడించారు. 2020 జరిగే రాష్ట్ర పోటీలు కొత్తగా నిర్మించబోయే కె.ఆర్.ఆర్. స్టేడియంలో జరుగుతాయని ఆనం ఆశాభావం వ్యక్తం చేశారు. అనేక సంవత్సరాలుగా జిల్లా, రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు అనేక  క్రీడా పోటీలలో జిల్లా నుంచి క్రీడాకారులను వెళ్లడం చూశామన్నారు. ప్రతి క్రీడా కారుడు పట్టుదలతో, మనోధైర్యంతో  ఉంటే విజయం సాధించ వచ్చని చెప్పారు. గతంలో గోవర్ధన్ రెడ్డి జెడ్పీ చైర్మన్ గా, మంత్రిగా తాను ఎన్నో క్రీడా కార్యక్రమాల్లో పాల్గొన్నామని గుర్తు చేశారు. ఆ సమయంలో పొదలకూరును క్రీడా కేంద్రంగా చేయాలని నిధులు కూడా మంజూరు చేశామన్నారు. స్థల సేకరణ విషయంలో కాకాణి  రమణారెడ్డి ఎంతో సహాయ సహకారాలు అందించారన్నారు. కొంత మేర నిర్మాణాలు జరిగి ఆ తర్వాత పనులు నిలిచి పోయాయని చెప్పారు.





ప్రస్తుతం సీఎం వై.యస్. జగన్ రూ. 2 కోట్లు నిధులను  మంజూరు చేశారు. త్వరలోనే పనులు కూడా ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఈ క్రీడా స్టేడియానికి కాకాణి రమణారెడ్డి పేరు పెట్టాలన్నారు. ఈ ప్రాంతంలో క్రీడాకారులు పట్ల ప్రోత్సాహం, తల్లితండ్రులకు అవగాహన కల్పించే విధంగా ఈ పోటీలు ఏర్పాటు చేశారని కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. విద్యార్థులకు చదువుతో పాటు, క్రీడల పట్ల ప్రాముఖ్యతను కూడా తల్లితండ్రులు నేర్పాలన్నారు. క్రీడాకారులకు కొందరు నాయకులు వాగ్దానాలు ఇచ్చి, వదిలేస్తారన్నారు. కానీ  పి వి సింధుకు సీఎం జగన్ విశాఖలో శిక్షణా కేంద్రానికి స్థలం ఇచ్చి ప్రోత్సహిస్తున్నారని అన్నారు. సమాజానికి మంచి క్రీడాకారులను అందించడానికి  క్రీడాకారులను ప్రోత్సాహిస్తున్నారని చెప్పారు. గెలుపు ఓటములు సహజమని, జట్టుగా ఏర్పడి. గెలవాలనే  పట్టుదల ముందుకు నడిపిస్తుందన్నారు. దివంగత ఆనం వివేకానంద రెడ్డికి క్రీడల పట్ల ఎంతో ఆసక్తి మెండుగా ఉందన్నారు. ఆయన  ఏ లోకంలో ఉన్నా అయన శాంతి చేకూరాలన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: