ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్, కొనుగోలు కోసం నిపుణులతో కూడిన ఒక విభాగాన్ని ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. పంటల ధరలను స్థిరీకరించటం కొరకు దీర్ఘకాలిక ప్రణాళికతో వెళ్లాలని అధికారులకు సూచించారు. గ్రామ, వార్డ్ వాలంటీర్ల సహాయంతో ప్రతి రైతు పంటలు రిజిస్ట్రేషన్ చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటామని చెప్పారు. 
 
రైతులు పంటలు ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవటం ద్వారా గిట్టుబాటు ధర కల్పించటం కొరకు ముందస్తు ప్రణాళిక వేసుకోవచ్చని అధికారులు సీఎంకు తెలిపారు. మినుములు, శనగలు, పెసలు ఇతర పంటల కొరకు అక్టోబర్ 15 వ తేదీలోపు కొనుగోలు కేంద్రాలను తెరవాలని సీఎం అధికారులకు సూచించారు. రైతులకు  కొనుగోలు కేంద్రాల దగ్గర ఎటువంటి ఇబ్బందులు రాకుండా అధికారులు చూడాలని సీఎం చెప్పారు. 
 
ధరల స్థిరీకరణ నిధిని సద్వినియోగం చేసుకోవాలని సీఎం సూచించారు. రైతు భరోసా పథకం అమలులో ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని సీఎం అధికారులకు సూచించారు. వర్షపాతం తక్కువగా ఉన్న ప్రాంతాలైన అనంతపురం, కడప, కర్నూల్ జిల్లాల్లో తృణ ధాన్యాల సాగును ప్రోత్సహించాలని సీఎం చెప్పారు. 1830 కోట్ల రుపాయల ఇన్ పుట్ సబ్సిడీని ఈ నెల చివరి నుండి రైతులకు అందించాలని అధికారులకు సీఎం ఆదేశాలిచ్చారు. 
 
టమాటా పంట ధరలు స్థిరంగా లేకపోవటంతో టమాటా పంట రైతులకు గిట్టుబాటు ధరను కల్పించటానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యవసాయ ఉత్పత్తులకు అధిక ధరలు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు తెలిపారు. చిరుధాన్యాల కొనుగోలు కోసం బోర్డును ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వమని రైతులకు మేలు చేకూరేలా నిర్ణయాలు తీసుకుంటామని అన్నారు. వైసీపీ ప్రభుత్వం రైతుల కోసం తీసుకుంటున్న నిర్ణయాలు రైతులకు మేలు చేసే విధంగా ఉన్నాయి. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: