రోజు మనం ఆటోలలో, కార్లలో, బస్సుల్లో ప్రయాణం చేస్తుంటాం.  బస్సులో తోటి ప్రయాణికులు ఏం చేస్తుంటారో గమనించడం ఈజీనే.  అదే రైల్లో తెలుసుకోవడం కాస్త కష్టమైనా పనే.  ఇక విమానల్లోనైతే.. తెలుసుకోవం మరీ కష్టం.   విమానంలో కొత్తగా ప్రయాణించే వ్యక్తులు కొన్ని విషయాల గురించి తప్పకుండా తెలుసుకోవాలి.  ఆ విషయాలు ఏమిటో ఇప్పుడు ఎలుసుకుందాం.  


విమానం ల్యాండింగ్ అయ్యే సమయంలో డీప్ అండ్ డిమ్ లైట్లు వేస్తారు.  దీని వెనుక ఒక కారణం ఉంది.  విమానం ల్యాండింగ్ సమయంలో అలర్ట్ గా ఉండాలని సిగ్నల్స్ ఇచ్చేందుకు ఇలా చేస్తారట.  ఏదైనా ప్రమాదం జరిగే సమయంలో కూడా ఇలాంటి లైట్లే వేస్తుంటారు.  


విమానం గాల్లో ఉండగా చాలామంది పైలెట్లు నిద్రపోతుంటారు.  కొందరు తమ కో పైలెట్ కు బాధ్యత అప్పగించి నిద్రపోతారట.  ఇక కొందరు పైలేట్లయితే.. తమ కో-పైలెట్ల కోసం వెతుక్కునే పనిలో ఉంటారని అంటారు.  విమానం సాధారణ ఎత్తులో ప్రయాణించే సమయంలో ఆక్సిజన్ మాములుగానే అందరికి అందుతుంది.  కాని, విమానం సాధారణ ఎత్తుకంటే.. ఎక్కువ ఎత్తులో ప్రయాణించే సమయంలో ఆక్సిజన్ అందరికి సరిగా అందదు.  అత్యవసర సమయంలో ఉపయోగించుకునేందుకు ప్రతి ప్రయాణికుడికి ఆక్సిజన్ మాస్కులు అందుబాటులో ఉంటాయి.  


ప్రతి విమానంలో ఇద్దరు పైలెట్లు ఉంటారు.   ఇద్దరికి ఒకే సమయంలో ఒకేరకమైన ఆహరం ఇవ్వరు.  ఇద్దరికీ వేరు వేరు సమయాల్లో వేరు వేరు ఆహరం ఇస్తారట.  ఎందుకంటే.. ఏదైనా ఫుడ్ పాయిజన్ వలన ఒక పైలెట్ అనారోగ్యం బారిన పడితే.. మరో పైలెట్ అందుబాటులో ఉంటాడు.  ఇక విమానంలో కొందరు తమ పెంపుడు జంతువులను తీసుకెళ్తుంటారు.  ఇలా తమతోపాటు జంతువులను తీసుకెళ్ళాలి అంటే.. వాటిని విమాన సిబ్బంది సురక్షితంగా తరలిస్తారట.  అయితే, వీటికి ప్రత్యేకమైన బోనులు ఏర్పాటు చేసి వాటిని తరలిస్తారు.  


విమానం టేకాఫ్ అయ్యే ముందు సిబ్బంది ఎలక్ట్రానిక్ వస్తువుల గురించి కొన్ని రూల్స్ ను ప్రయాణికులకు వివరిస్తారు.  ఇలా ప్రయాణికులకు రూల్స్ గురించి చెప్పిన కొందరు పట్టించుకోకుండా మొబైల్ ఫోన్ చాటింగ్ చేస్తూ బిజీగా ఉంటారట. విమానం గాలిలో ప్రయాణించే సమయంలో ఉరుములు, మెరుపులు వంటివి సంభవించి ఏదైనా ఆటంకం కలిగితే.. వాటి నుంచి తప్పించుకునే క్రమంలో ఎలాంటి నిర్ణయమైన తీసుకునే అధికారం పైలెట్లకు ఉంటుందట.  


విమానం టేకాఫ్ అయిన దగ్గరి నుంచి ల్యాండింగ్ అయ్యే వరకు హెడ్ ఫోన్స్ అందుబాటులో ఉంటాయి.  అయితే, వీటిని వినియోగించే ముందు తప్పకుండా క్లీన్ చేసుకోవాలి.  
విమానంలో అందించే నీరు తాగాద్దోనని కొందరు చెప్తుంటారు.  ఎందుకంటే.. నీరు తక్కువగా ఉన్నప్పుడు టాంకర్ లోని యురిన్ ను నీటి కోసం వినియోగిస్తారని అవి తాగితే రోగాలు వస్తాయని అంటుంటారు.  
ఇప్పుడు కాఫీలు, టీ లు తాగే అలవాటు అందరికి ఉంటుంది.  విమానంలో ప్రయాణించే సమయంలో సహాయకులు అందించే కాఫీ, టీ లు తీసుకోవద్దు.  ఎందుకంటే కాఫీ కోసం వినియోగించే నీరు అంత సురక్షితం కాదట.  


ఫ్లైట్ లో టాయిలెట్ కు వెళ్ళే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.  టాయిలెట్ లోకి వెళ్ళగానే బయట డోర్ లాక్ అవుతుంది.  దీంతో కొందరు తత్తరపాటుకు లోనవుతారు.  అయితే, లోపలి వెళ్ళే సమయంలో బయట స్మోకింగ్ బటన్ కింద బోల్డ్ ను బిగిస్తే అన్ లాక్ అవుతుంది. విమాన ప్రమాదాల్లో ఎక్కువ ప్రమాదాలు ల్యాండింగ్ సమయంలోనే జరుగుతుంటాయి.  వాతావరణం అనుకూలించని సమయంలోను, రన్ వే మొత్తం నీటితో నిండిపోయినపుడు ఫ్లైట్ ల్యాండింగ్ అవ్వడం కష్టం అవుతుంది.  ఈ సమయంలో కూడా పైలెట్ లో టాలెంట్ ఉంటె.. తప్పకుండా ల్యాండింగ్ చెయ్యొచ్చు.  


పెద్దపెద్ద విమాన సంస్థలకు చెందిన విమానాల్లో తక్కువ అనుభవం కలిగిన వారిని తీసుకుంటూ ఉంటారు.  ఎందుకంటే.. ఎక్కువ విమానాలు ఉంటాయి.  ఎక్కువ వేతనం ఇవ్వాలి.  కాబట్టి తక్కువ అనుభవం ఉన్నవారిని తీసుకుంటే సరిపోతుంది అనే భావనలో ఉంటాయి.  అనభవ రాహిత్యం కలిగిన పైలెట్ విమానం నడిపితే.. ప్రయాణికుల ప్రాణాలకు భరోసా ఉండదు.  విమానంలో ఆయిల్ లేకపోయినా.. లేదా ఏదైనా ప్రమాదం జరిగి ఇంజన్ పనిచేయకపోయినా న్యూట్రల్ చేసి విమానాన్ని కొంతదూరం ప్రయాణించే విధంగా చెయ్యొచ్చు.  రెండు ఇంజన్లు ఫెయిల్ అయినప్పటికీ దాదాపు 6 నాటికల్ మైళ్ళు అంటే 42 మైళ్ళ దూరం ప్రయాణం చెయ్యొచ్చు.  టాయిలెట్స్ లో పొగ తాగడం, గుట్కా నమలడం వంటివి చేయకూడదు.  దీని వలన టాయిలెట్ లు పాడైపోయి వాసన వస్తుంది.  దీంతో పాటు రోగాలు వచ్చే అవకాశం కూడా ఉంటుందట.  


మరింత సమాచారం తెలుసుకోండి: