చిన్న పిల్లలు తప్పు చేస్తే ఓ చిన్న దెబ్బ ప్రేమగా కొట్టి వూరుకుంటాము అదే ప్రాణం తీస్తే వారిని ఏం చేస్తాం.ఏం చేయడానికి వీలు లేదు.ఎందుకంటే మరీ రెండేళ్ల పాప ప్రాణం తీస్తుందని ఎవరు ఊహించరు కదా ఒకవేళ తీసిన వారి కోసం ప్రత్యేక చట్టమంటూ ఏమిలేదు .ఇందంతా నిర్లక్షంగా ఉండటం వల్ల జరిగిందని తేలింది.ఇంతకు పసిపిల్ల ప్రాణం తీయడమేంటని కదా మీ డౌట్ ఐతే చదవండి..అభం శుభం తెలియని ఆ రెండేళ్ల చిన్నారి తనకు తెలియకుండానే,తల్లి చావుకు కారణమైంది.అయితే,ఈ హత్య ఆమె కావాలని చేసినది కాదు.తాను కేరింతలు కొడుతూ కారులో చిన్న స్విచ్‌ను నొక్కడం వల్ల తల్లి అనుకోకుండా ప్రమాదంలో చిక్కుకుని,తన పుట్టిన రోజునే ప్రాణాలు విడిచింది.



బెలారస్ దేశంలోని స్టార్రో సెలోలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు తెలుసుకుంటే.యులియా షర్కామ్,తన పుట్టిన రోజు సందర్భంగా,రెండేళ్ల కుమార్తెతో కలిసి బీఎండబ్ల్యూ ఏ34 కారులో స్నేహితులతో బయటకు వెళ్లి,పుట్టిన రోజు వేడుకల తర్వాత చిన్నారితో కలిసి ఇంటికి వచ్చింది.కారు దిగి వెనక సీట్లో కూర్చున్న చిన్నారిని తీసుకోవడానికి అన్నట్లు సగం తెరిచి ఉన్న కారు కిటికీలోకి దూరి బయటకు తీసేందుకు తల లోపలికి దూర్చింది.అయితే, ఆ చిన్నారి కారు కిటికీ అద్దాలను మూసే ఎలక్ట్రిక్ స్విచ్చ్ నొక్కడంతో తల లోపల ఇరుక్కుపోయింది. ఎంత ప్రయత్నించినా యులియా తలను బయటకు తీయలేకపోయింది.కారు అద్దాలు యులియా మెడను గట్టిగా నొక్కేయడంతో ఆమె స్పృహ కోల్పోయింది.కొద్ది సేపటి తర్వాత ఆమె భర్త అర్తుర్ బయటకు వచ్చి చూడగా,యూలియా కారుకు వేలాడుతూ కనిపించిందట.



దీంతో కిటికీ అద్దాలను పగలగొట్టి ఆమెను విడిపించి,ఆమె ముఖం మీద నీళ్లుచల్లి లేపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో,అంబులెన్సుకు ఫోన్ చేసి ఆసుపత్రికి తీసుకెళ్లాడట,ఐతే కఠం పై ఎక్కువ ఒత్తిడి జరగడం,శ్వాస సరిగ్గా అందక ఆమె చికిత్స ప్రారంభించిన,ఎనిమిది రోజుల తర్వాత మరణించిందట.పోలీసులు తెలిపారు.ఇక ఈ హత్యతో ఆమె భర్తను అనుమాన స్పదంగా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.కారు లోపల ఉన్న స్వీచ్చ్‌ను చిన్నారి నొక్కిందా లేదా యులియా ప్రెస్ చేసిందా అనేది తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.అయితే,ఆ స్విచ్చ్ యులియాకు అందనంత దూరంలో ఉండటంతో చిన్నారే ప్రెస్ చేసి ఉండవచ్చని భావిస్తున్నారు.చూసారా అజాగ్రత్తగా వున్న పాపానికి ఓ నిండు ప్రాణం ఎలా బలైయ్యిందో.ఆ పాపకు పాపం తెలియదు తాను పుట్టి తన తల్లి ప్రాణం తీస్తానని ముందే తెలిసివుంటే ఏం చేసేదో.ఏది ఏమైన కొన్ని కొన్ని సంఘటనలు ఎందుకు జరుగుతాయో ఎవ్వరు చెప్పలేరు అంటున్నారు ఈ వార్త చదివిన వారు...

మరింత సమాచారం తెలుసుకోండి: