ప్రపంచంలో ఎన్నో వింతలు విశేషాలు జరుగుతూ ఉంటాయి.  ఒక్కోసారి జరిగే కొన్ని రకాలైన సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.  అలాంటి వింతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.  మాములుగా వర్షం కురిసే సమయంలో అప్పుడప్పుడు వడగళ్ళు పడతాయి.  కొన్నిసార్లు కప్పలు, చేపలు వంటివి కూడా ఆకాశం నుంచి కురుస్తుంటాయి.  కాని, మీరెప్పుడైన ఆకాశం నుంచి ఆవు పడటం చూశారా.. ఆకాశం నుంచి ఆవు పడటం ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారా అక్కడికే వస్తున్నా.. 


జపాన్ కు చెందిన కొందరు బెస్తవాళ్ళు చేపలు వేటాదేందుకు సముద్రంలోకి వెళ్లారు.  అలా రోజులాగే చేపలు పడుతుండగా ఆకాశం నుంచి హటాత్తుగా ఓ ఆవు వారి బోటుపై పడింది.  అంటే వారు షాక్ అయ్యారు.. తేరుకునే లోపే ఆ వారి బోటు సముద్రంలో మునిగిపోసాగింది.  అయితే, సముద్రంలో పెట్రోలోంగ్ నిర్వహిస్తున్న రష్యన్ నావీ వారిని రక్షించి జపాన్ అధికారులకు అప్పగించింది.  


జపాన్ అధికారులు వారిని ప్రశ్నించగా.. ఆకాశం నుంచి ఆవు పడిందని అందుకే బోటు మునిగిందని చెప్పారు.  వారు చెప్పిన సమాధానం వింతగా ఉండటంతో.. అధికారులు నమ్మలేదు.  వారిని అరెస్ట్ చేశారు.  అయితే, నావీలో పనిచేసే ఓ అధికారి కొన్ని ఆవులను దొంగిలించి దానిని కార్గో విమానంలో తరలిస్తుండగా.. విమానం మోయగలిగే బరువు కంటే అధికంగా బరువు ఉండటంతో విమానం బ్యాలెన్స్ తప్పడం మొదలు పెట్టింది.  వెంటనే ఆ అధికారి కొన్ని ఆవులను బయటకు తోసేసాడట.  ఆ విషయాన్ని రష్యా అధికారులు రెండు వారాల ద్రువీకరించి విషయాన్ని జపాన్ వారికి చెప్పడంతో అరెస్ట్ చేసిన వారిని విడుదల చేశారు.  


ఇరిక్ రేస్ అనే వెబ్ డిజైనర్ ఓసారి తన కెమెరా, కొన్ని వస్తువులను తీసుకొని స్నేహితుని ఇంటికి బయలు దేరాడు.  అలా కారులో వెళ్తుండగా.. మద్యలో వర్షం స్టార్ట్ అయింది.  అయితే అది మామూలు వర్షం కాదు.  స్పైడర్ రైన్.  దీంతో ఇరిక్ షాక్ అయ్యాడు.  స్పైడర్ రైన్ కురవడం ఏమిటి అని షాక్ తిన్నాడు.  తాను చూస్తున్నది నిజమేనా కాదా అని సందేహించాడు.  కొద్ది దూరంలో సాలీడులు పెద్ద గూడు పెట్టాయట. వందలాది సాలీడు పురుగులు ఆ గూడులో ఉండసాగాయి.  సడెన్ గా పెద్ద ఎత్తున గాలి వీయడంతో ఆ గాలికి గూడు చెదిరిపోయింది.  సాలీడు పురుగులు గాలిలో కలిసిపోయి వానలా కురిసాయట.  


సెప్టెంబర్ 1, 1969 న ఫ్లోరిడాలోని ఓ గోల్ఫ్ కోర్స్ లో గోల్ఫ్ ఆడుతుండగా ఒక్కసారిగా గోల్ఫ్ బాల్స్ ఆకాశం నుంచి వర్షంలా కురిసాయి.  అవి ఎక్కడి నుంచి వచ్చాయో అర్ధం కాలేదు.  కాగ, ఆ గోల్ఫ్ కోర్స్ కు కొద్ది దూరంలో మరో గోల్ఫ్ కోర్ట్ ఉంది.  అక్కడ సడెన్ గా టార్పేడోలు ఏర్పడంతో.. ఆ కోర్స్ లో ఉన్న బాల్స్ అన్ని గాలిలో కలిసిపోయాయి.  ఇటీవలే వియాత్నంలో ఓ నిర్మానుష్య ప్రాంతంలో గుండ్రంగా ఉన్న లోహ గోళం ఒకటి ఆకాశం నుంచి పడింది.  ఆ గోళం వలన ఎవరికీ ఎటువంటి హాని జరగలేదు.  కాని కొంతమంది పరిశోధకుల పరిశోధనలలో ఆ గోళం రష్యా స్పేస్ క్రాఫ్ట్ కు చెందినది కాని లేదా ఏదైనా అంతరిక్ష ఉపగ్రహానికి చెందినదైన అయి ఉంటుందని భావిస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: