ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద ఆరోపణలు, విమర్శలు రాజకీయ పరిధిని దాటి ముందుకు పోతున్న సంగతి తెలిసిందే. ఆ మాటకు వస్తే ఏపీలో రాజకీయం హద్దులు దాటి చాలా కాలమే అయింది. వ్యక్తిగత వ్యవహారాలకు వచ్చేసింది. ఇక్కడ ఓడిన వారు జీర్ణించుకోలేకపోతున్నారు. జగన్ సీం ఈ రెండు అక్షరాలను కలిపి చూడలేకపోతున్నారు. దాంతో మీడియా ముందు ఎంత మాట వస్తే అంత మాట అనేస్తున్నారు. కనీసం   ముఖ్యమంత్రి చైర్ కి అయినా మర్యాద ఇవ్వాలన్న దానిని మరచిపోతున్నారు.


ఇక జగన్ని విమర్శించకపోతే తెల్లారని విపక్ష నేతగా చంద్రబాబు ఉన్నారు. ఆయన జగన్ని పట్టుకుని దారుణంగా మాటలనేశారు. జగన్ని అంతా చీ కొడుతున్నారని బాబు కొత్త విశ్లేషణ అందించారు. జగన్ మూడు నెలల పాలనలో జగన్ విసుగెత్తిపోయారని కూడా ఆయన అంటున్నారు. ఏదో చేస్తాడానుకుంటే జగన్ అన్నింటా అభద్రతాభావం కలిగించారన్న భావన జనంలో ఉందని కూడా బాబు చెప్పుకొచ్చారు.



పార్టీ నాయకులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో బాబు మాట్లాడుతూ, ఏపీలో జగన్ కి ప్రజా వ్యతిరేకత వెల్లువగా ఉందని అంచనా కట్టేసారు. ఇక జనంలోకి వెళ్లి చెప్పాల్సింది  ఇవన్నీ చెప్పడమేనని కూడా తమ్ముళ్లకు హితవు  చెప్పారు. జగన్ పాలన ఎలా ఉందంటే సొంత పార్టీ నాయకులు సైతం ఆయన పోకడలన పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని కూడా బాబు అంటున్నారు. జగన్ ఎవరి మాటా వినరని బాబు అంటూ అదే సొంత పార్టీ నేతలకు తలనొప్పిగా మారిందని అన్నారు.


ఇక జగన్ని మూర్ఖుడంటూ ఘాటైన  పదజాలం కూడా ఉపయోగించిన బాబు జగన్ కనీసం ఏపీలో సందపను స్రుష్టించలేకపోయారని విమర్శించారు. ఆదాయ మార్గాలను వెతుక్కోలేకపోయారని, జగన్ అనుభవ రాహిత్యానికి ఇది నిదర్శనమని కూడా విమర్శించారు. మొత్తానికి ఇపుడు బాబు మదిలోని ఆలోచనలు తమ్ముళ్ళకు చేరవేశారు. రేపు వారు నోటి వెంట ఇవే మాటలు మీడియా సమావేశం ముఖంగా వస్తాయన్న మాట. మొత్తానికి వ్యక్తిగత దూషణలకు నాయకులు దిగడం దారుణమే.



మరింత సమాచారం తెలుసుకోండి: