ఏంటో అన్ని రివర్స్ జరుగుతున్నాయి. మొన్నటి వరుకు బంగారం భారీగా పెరిగింది. మధ్య తరగతి వారికీ అనుకూలంగా లేదని తెలుసుకొని ఇప్పుడు బంగారం భారీగా తగ్గుతూ వస్తుంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే బంగారం ధర పెరిగితే పెట్రోల్ ధర తగ్గుతుంది. అదే బంగారం ధర తగ్గితే రోజుకి 10పైసలు ప్రకారం వారానికి రూపాయి పెంచేస్తుంది.                              


వీటి అనుబంధం ఏంటో తెలీదు కానీ.. ప్రస్తుతానికి అయితే బంగారం ధర భారీగా తగ్గుతుంది. రోజుకి రెండు వందలు 300 చొప్పున ఇప్పటికే 2,400 రూపాయిలు తగ్గిపోయింది. ఇలా రోజు రోజుకు తగ్గుతుంటే పసిడి ప్రేమికులు ఆనందపడిన మరోవైపు బయపడ్డుతున్నారు. ఇలా తగ్గుతుంది అంటే ఖచ్చితంగా త్వరలో పెరగనుంది అని.                               


ఇంకా విషయానికి వస్తే 24 క్యారెట్ల బంగారం ధర రూ.310 తగ్గుదలతో రూ.39,090కు చేరింది. 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.230 తగ్గుదలతో రూ.35,840కు దిగొచ్చింది. గ్లోబల్ మార్కెట్‌లో బలహీనమైన ట్రెండ్ సహా దేశీ జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ లేకపోవడంతో బంగారం ధర తగ్గిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.                    


కాగా బంగారం ధర రోజు రోజుకు తగ్గు వస్తున్నప్పటికీ వెండి ధర మాత్రం అలాగే స్దిరంగా కొనసాగుతుంది. ఏది ఏమైనా బంగారం తగ్గటం పసిడి ప్రియులకు ఊరటనిస్తోంది.                 


మరింత సమాచారం తెలుసుకోండి: