మన పళ్లకు చిన్న సమస్య వస్తే చాలు డెంటిస్ట్ దగ్గరకు వెళ్లాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎనామిల్ పూత దెబ్బతినటం, పుచ్చిపోవటం వంటి సమస్యలకు డెంటిస్ట్ లను ఎక్కువగా సంప్రదించాల్సి వస్తుంది. కానీ ఇకముందు చిన్న చిన్న సమస్యలకు డెంటిస్ట్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. మన పళ్లను సొంతంగా మనమే ఇంట్లో కూర్చొని 48 గంటల సమయంలో సులభంగా రిపేర్ చేసుకోవచ్చు. 
 
చైనా దేశానికి చెందిన పరిశోధకులు పళ్లకు రక్షణగా ఉండే ఎనామిల్ పూతకు సంబంధించిన సమస్యలకు పరిష్కారంగా ఒక ప్రత్యేకమైన జెల్ ను కనిపెట్టారు. ఈ జెల్ పళ్లకు ఉపయోగించటం ద్వారా 48 గంటల సమయంలో పళ్లకు సంబంధించిన ఎనామిల్ సమస్యలు దూరమవుతాయి. సాధారణంగా పళ్లు పసుపు పచ్చ రంగులో ఉన్నవారు పళ్లను తెలుపు రంగులోకి మార్చటం కొరకు పళ్లను గట్టిగా తోమటం, పళ్లపై ఒత్తిడి పడేలా చేయటం చేస్తూ ఉంటారు. 
 
ఇలా చేయటం వలన కొన్ని సందర్భాలలో పళ్లపై ఉన్న ఎనామిల్ పొర దెబ్బ తింటుంది. ఎనామిల్ సమస్య ఏర్పడితే పళ్ల మధ్య సందులు ఏర్పడి క్యావిటీలు ఏర్పడటం, పళ్లు పాడవటం జరుగుతుంది. జియాంగ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ సమస్యలపై పరిశోధనలు చేశారని తెలుస్తోంది. ఈ పరిశోధనల ద్వారా ఫాస్పేట్, క్యాల్షియం జెల్ పళ్లకు ఉపయోగించి పళ్లు సెల్ఫ్ రిపేర్ చేసుకోవచ్చని తెలుస్తోంది. 
 
జెల్ నుంచి వచ్చే కొత్త ఎనామిల్ 3 మైక్రో మీటర్ల మందంగా ఉంటుందని ఎన్ని లేయర్లు కావాలంటే అన్నిసార్లు జెల్ ఉపయోగించాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఈ పరిశోధనల కోసం దాతల నుండి ఒక పంటిని తొలగించి పరీక్షలు జరిపారని సమాచారం. మొదట ఎలుకలపై పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత మనుషులపై ప్రయోగాలు చేస్తారని తెలుస్తుంది. పరిశోధకులు చేస్తున్న ప్రయోగం కనుక సక్సెస్ అయితే పళ్ల సమస్యలతో బాధ పడేవారికి ఈ జెల్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: