బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. దీంతో పాటుగా దేశంలో కొత్త వివాదం తెర‌మీద‌కు తెచ్చారు. ఢిల్లీలో నిర్వహించిన హిందీ దివస్‌ సమారోహ్‌లోనూ తన వాదనను పునరుద్ఘాటించారు. దేశమంతటికీ ఉమ్మడి భాషగా హిందీ ఉండాలని, అది మాత్రమే దేశం మొత్తాన్ని ఐక్యం చేయగలదని చెప్పారు. దేశమంతటా హిందీ భాష ఉండాలన్నది మహాత్మాగాంధీ, సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ కల అని, దానిని సాకారం చేయాలని కోరారు. దేశమంతటికీ ఒకే ఉమ్మడి భాష ఉంటే, అది భారత్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపునిస్తుందని తెలిపారు.


హిందీ దివస్‌ సందర్భంగా శనివారం ఆయన ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ హిందీని దేశంలోని వివిధ ప్రాంతాలకు విస్తరించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. దేశమంతటికీ ఉమ్మడి భాషగా హిందీ ఉండాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పేర్కొన్నారు. దేశంలో హిందీ భాషను ఎక్కువమంది మాట్లాడుతారని, అది దేశం మొత్తాన్ని ఐక్యం చేయగలదని తెలిపారు. ప్రతి ఒక్కరు తమ మాతృభాషలో సాధ్యమైనంత మేరకు మాట్లాడాలంటూనే.. హిందీని దేశంలోని వివిధ ప్రాంతాలకు విస్తరించేందుకు ప్రయత్నిస్తామని పేర్కొన్నారు. హిందీ దివస్‌ సందర్భంగా హోం మంత్రి శనివారం ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ, ‘భారతదేశంలో అనేక భాషలున్నాయి. ప్రతి భాషకు ప్రాముఖ్యత ఉన్నది. కానీ దేశమంతటికీ ఒక ఉమ్మడి భాష ఉండాల్సిన అవసరమున్నది. ఆ భాష భారత్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపునిస్తుంది’అని తెలిపారు. నేడు దేశాన్ని ఐక్యం చేయగల భాష ఏదైనా ఉందంటే.. అది ఎక్కువ మంది మాట్లాడే హిందీయేనని స్పష్టం చేశారు. ప్రజలు తమ స్థానిక భాషను ప్రోత్సహిస్తూనే హిందీని కూడా ఉపయోగించాలని విజ్ఞప్తి చేశారు. దేశమంతటా హిందీ భాష ఉండాలన్నది బాపూ (మహాత్మా గాంధీ), సర్దార్‌ (వల్లభ్‌భాయ్‌ పటేల్‌)ల కల అని, దానిని సాకారం చేయాలని కోరారు.


అయితే, అమిత్‌షా వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. ‘హిండియా’ ప్రయత్నాలతో మరో భాషాయుద్ధం తప్పదని డీఎంకే హెచ్చరించగా, హిందీని తమపై బలవంతంగా రుద్దరాదని కన్నడ పార్టీలు స్పష్టంచేశాయి. హిందీ జాతీయ భాష కాదని, అది కూడా రాజ్యాంగం గుర్తింపునిచ్చిన 22 భాషల్లో ఒకటని కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య పేర్కొన్నారు. అన్ని భాషలకు సమాన గౌరవం ఇవ్వాలని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ సూచించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: