గత కొన్ని నెలలుగా ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉందనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థ మందగమనంతో వాహనాల విక్రయాలు కూడా పడిపోయాయి. ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ రంగంలో కూడా పెట్టుబడులు తగ్గిపోయాయి. గడచిన కొన్ని నెలలుగా దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మందకొడిగానే ఉంది. ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్న సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవటంతో సమస్యల నుండి బయటపడవచ్చు. 
 
ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్న సమయంలో ఖర్చులను వీలైనంతగా తగ్గించుకోవటం మంచిది. వృథా ఖర్చులను తగ్గించుకోవటంతో పాటు, కొత్త వస్తువుల కొనుగోలును వాయిదా వేయటం మంచిది. ఎందుకంటే మందగమనంలో లక్షలాది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది. అందువలన ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పొదుపుపై ఎక్కువగా దృష్టి పెట్టటం కూడా మంచిది. 
 
మందగమనం సమయంలో ఉద్యోగాల మార్పు కొరకు ప్రయత్నించకపోవటమే ఉత్తమం. మార్కెట్లో పరిస్థితులు ప్రతికూలంగా ఉండటంతో చాలా కంపెనీలు మూత పడే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఉద్యోగం మారాల్సి వస్తే కంపెనీకి సంబంధించిన అన్ని విషయాలను పరిశీలించుకొని మాత్రమే ఉద్యోగం మారటం మంచిది. టెక్నాలజీ సంబంధిత ఉద్యోగాల్లో ఉండేవారు నైపుణ్యాల్ని మెరుగుపరచుకోవలసిన అవసరం ఉంది. 
 
మందగమనంలో రుణాలను తీర్చటం కూడా అంత సులభమైన విషయం కాదు. నిర్ణీత సమయంలో రుణాల్ని చెల్లించలేకపోతే రుణాల్ని రీ షెడ్యూల్ చేయటం ఉత్తమం. మందమనంలో కంపెనీలు జీతాలు తగ్గించే అవకాశం కూడా ఉంది. అందువలన భవిష్యత్ అవసరాల కొరకు కొంత డబ్బును దాచి ఉంచుకోవటం వలన ఏవైనా సమస్యలు వస్తే ఆ సమస్యల నుండి బయటపడవచ్చు. బీమా కవరేజీ విషయంలో మాత్రం రాజీ పడకుండా కుటుంబంలో వ్యక్తులందరికీ ఆరోగ్య భీమా కలిగి ఉండటం ఉత్తమమైన పని. వ్యక్తిగతంగా ఆరోగ్య భీమా ఉండటం వలన ఉద్యోగం కోల్పోయినా ఆరోగ్య భీమా అనారోగ్యానికి గురైతే రక్షిస్తుంది. 




మరింత సమాచారం తెలుసుకోండి: