ఆర్టికల్ 370 తరువాత ఇండియా.. పాకిస్తాన్ దేశాల మధ్య వార్ కు సంబంధించిన విషయాలు దారుణంగా మారిపోతున్నాయి.   యుద్ధ వాతావరణం నెలకొన్నది.  యుద్ధం విషయంలో ఇండియా సైలెంట్ గా ఉన్నా పాకిస్తాన్ మాత్రం యుద్ధం చేసితీరుతామని అంటోంది.  అవసరమైతే అణుయుద్ధం చేయడానికి సైతం వెనకాడబోమని చెప్పింది పాక్.  అంతర్జాతీయంగా ఇండియాను ఒంటరిని చేయడానికి, ఇండియాపై అభాండాలు వేయడానికి చాలా ప్రయత్నాలు చేసింది.  ప్రయత్నాలు చేసినా పెద్దగా పెద్దగా ఉపయోగం లేదు.  


అంతర్జాతీయంగా ఇండియాపై ఇచ్చిన కంప్లైంట్స్ ఫెయిల్ అయినట్టు పాక్ బహిరంగంగా ఒప్పుకున్న సంగతి తెలిసిందే.  ప్రతి చోటా  తగులుతున్నా... పాక్ మాత్రం తన బుద్దిని పోనిచ్చుకోటం లేదు.  సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే కాల్పులు జరుపుతున్నది.  ఇండియా ఎదురు కాల్పుల్లో పాక్ సైనికులు మరణిస్తూనే ఉన్నారు.  అయినా పాక్ మాత్రం వెనకడుగు వేయడం లేదు.  


ఇటీవలే పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఇండియాలోని 20 కోట్ల మంది ముస్లింలు ఉగ్రవాదులుగా మారాలని చెప్పడం పాక్ కుతంత్రానికి ఓ ఉదాహరణగా చెప్పొచ్చు.  అయితే, పాక్ ఇండియాతో సంప్రదాయ యుద్ధం చేస్తే.. గెలవలేమని చెప్పిన ఇమ్రాన్ ... రెండు దేశాలు అణుబాంబులు కలిగి ఉన్నాయని, అణుయుద్ధం జరిగి తీరుతుందని అణుయుద్ధంతోనే యుద్ధం ముగుస్తుందని అంటున్నాడు. అయితే, యుద్ధం చేయాలని కోరుకోవడం లేదని అంటూనే.. ఇలా మాట్లాడటం వెనుక ఆంతర్యం ఏంటో అర్ధం కావడం లేదు.  


ప్రతి విషయాన్ని ఇండియా నిశితంగా పరిశీలిస్తూనే ఉన్నది.  ఎక్కడ ఏ విషయంలోనూ వెనకడుగు వేయడం లేదు. ఇండియా సైన్యం కూడా రెడీగా ఉండటం విశేషం. కేంద్రం అనుమతి ఇస్తే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను స్వాధీనం చేసుకుంటామని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.  ఈ నేపథ్యంలో పాక్ యుద్ధం గురించి ఇలా మాట్లాడటం విచిత్రంగా ఉన్నది. 


మరింత సమాచారం తెలుసుకోండి: