గత కొద్ది రోజులుగా అటు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ ను కూడా ఊపేస్తున్న నల్లమల యురేనియం మైనింగ్ చివరికి ఒక కొలిక్కి వచ్చింది. ఇప్పటి వరకు ఎంతో మంది సెలబ్రెటీలు, సోషల్ వర్కర్ లు మరియు సామాన్య ప్రజలు పర్యావరణాన్ని కాపాడాలని.. మైనింగ్ ను నిలిపివేయాలని తమ వ్యతిరేకతను వేర్వేరు పద్ధతుల్లో తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేసి సంగతి తెలిసిందే. తర్వాత కేటీఆర్ తాను ఖచ్చితంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడి దీనిపై స్పష్టీకరణ ఇస్తామని హామీ ఇచ్చాడు. నేడు తెలంగాణలో జరిగిన శాసనసభ మండలిలో మంత్రి కేటీఆర్ ఈ విషయంపై తమ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 

ఆయన చెప్పిన దాని ప్రకారం అసలు యురేనియం మైనింగ్ కు తమ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని… ఇదంతా ఎక్కడినుంచో వచ్చిన పుకార్లు అని ఆయన స్పష్టం చేశాడు. భవిష్యత్తులో కూడా ఇలాంటి మైనింగులకు అనుమతులు కూడా ఇవ్వబోమని ఆయన స్పష్టం చేశాడు. ఆయన అన్న ఈ మాటలు చూసి ఇన్ని రోజులు అదే పనిగా నల్లమల్ల యురేనియం మైనింగ్ ఆపివేయాలని నిరసన చేస్తున్నవారందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. పర్యావరణ ప్రేమికుడు అయిన ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఒక పెద్ద పథకం అయినటువంటి 240 కోట్ల మొక్కలు నాటే హరితహారం చేపట్టిన వ్యక్తి అని… అలాంటివారు యురేనియం మైనింగ్ కి అనుమతి ఎలా ఇస్తారని కేటీఆర్ ప్రశ్నించారు.

ఇకపోతే ఇవన్నీ కేవలం రాజకీయ పరంగా.. కుట్రపూరితంగా చేసిన ఆరోపణలు అని తాము కూడా ఇప్పుడు కావాలంటే… అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు దీనికి అనుమతినిచ్చింది… ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చి మేం తవ్వుకుంటాం అని చెబుతున్నా.... మేము ఆపుతున్నాం అని చెప్పచ్చు కానీ తాము ఆ దారిని ఎంచుకోలేదని అన్నాడు. ప్రతీ సమస్యను రాజకీయం చేయడం సరి కాదని ఆయన అన్నాడు. అయితే ఈ పుకారు ఎక్కడి నుంచి పుట్టిందో.. ఎక్కడ మొదలైందో తెలీదు కానీ చివరికి తెలంగాణ ప్రభుత్వం అయితే తాము ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని... ఎలాంటి అక్రమ మైనింగ్ జరుగుతున్నా అడ్డుకుంటామని హామీ మాత్రం ఇచ్చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: