గత కొద్ది రోజులుగా ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ కశ్మీర్ వ్యవహారాన్ని తాము యునైటెడ్ నేషన్స్ ముందుకు తీసుకొనివెళ్లినా... వారు ఎలాంటి సమాధానం ఇవ్వడం లేదని వాపోతున్నాడు. ఈ పరిస్థితుల్లో తాజాగా ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ పాకిస్తాన్ కి భారత్ కి మధ్య త్వరలోనే యుద్ధం జరుగుబోతోందన్న సూచనలు జారీ చేశాడు. రెండు దేశాలు అణ్వాస్త్రాలు కలిగి ఉంటే ఇటువంటి పరిస్థితుల్లో చివరకి జరిగేది యుద్ధమే అని ఇమ్రాన్ ఖాన్ అన్నాడు.

ఒకవేళ భారత్ అందుకు సిద్ధమైతే కచ్చితంగా అణు దాడులు జరుగుతాయని అందులో పాకిస్తాన్ ఓడిపోవచ్చు అని కూడా అతను అభిప్రాయపడ్డాడు. కానీ దాని తర్వాత పర్యవసానాలు మాత్రం తీవ్రంగా ఉంటాయని ఇమ్రాన్ ఖాన్ హెచ్చరించారు. "ఒక యుద్ధం జరిగేటప్పుడు ఏదైనా దేశం రెండు మార్గాలు ఎంచుకోవాల్సి ఉంటుంది. ఒకటి ముందే లొంగిపోవడం లేదా చచ్చే వరకు స్వాతంత్రం కోసం చనిపోవడం," అని ఇమ్రాన్ ఖాన్ మీడియా తో చెప్పాడు.

తన దేశం కచ్చితంగా చావు వరకు పోరాడుతుందని కూడా అతను స్పష్టం చేశాడు. అణ్వాయుధాలు కలిగిన ఒక దేశం చావు వరకు పోరాడితే తర్వాత పర్యవసానాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయని అతను గుర్తు చేశాడు. అలాగే ఈ కాశ్మీరు వ్యవహారం అతి త్వరలో సద్దుమణగక పోతే దాని ప్రభావం ప్రపంచ మార్కెట్ పైన కూడా పడుతుందని ఆయన అన్నాడు.

తర్వాత ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ పాకిస్తాన్ ఎన్నడూ అణు యుద్ధం మొదలు పెట్టదని... తాను అందుకు వ్యతిరేకం అని స్పష్టం చేశాడు. యుద్ధం ముగిసిన వెంటనే మన కనీస ఊహకు కూడా అందని పర్యవసానాలు ఉంటాయని... ఉదాహరణకి వియత్నాం మరియు ఇరాక్ లో జరిగిన యుద్ధాలు చూస్తే అవి ఏ సమస్యల కోసం అయితే జరిగాయో అంతకన్నా పెద్ద సమస్యలు యుద్ధం తర్వాత ఏర్పడ్డాయని ఆయన గుర్తు చేశాడు. ఇదిలా ఉండగా ఇంతకుముందే న్యూయార్క్ టైమ్స్ మీడియా సంస్థ భారతదేశానికి కాశ్మీరు విషయమై అణు ముప్పు ఉందని హెచ్చరించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: