పర్యాటక బోటు మునక ఘటనతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. బొట్లు, లాంచీలు, పడవలకు నాణ్యత వాటి పని తీరుపై నివేదిక ఇవ్వాలని, వాటిని నడిపే ప్రతి ఒక్కరు శిక్షణ, నైపుణ్యం ఉందా లేదా అనేది తనిఖీ చేసి వారికీ శిక్షణ ఇవ్వాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకూడదని అధికారులకు వైఎస్ జగన్ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. బోటు ప్రమాదంలో వారికీ అన్ని విధాలుగా సహకారం అందిస్తామని  ఆయన ప్రకటించారు.ఇచ్చారు. బోటు ప్రమాదంలో వారికీ అన్ని విధాలుగా సహకారం అందిస్తామని,  ఆయన ప్రకటించారు. ప్రమాదానికి గురైన లాంఛీకి బోటింగ్ చేసే అనుమతి లేదన్నారు. నదిలో వరద ఉదృతి ఎక్కువ ఉన్నప్పటికీ బోటింగ్ కు సిద్ధపడిన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి సుచరిత తెలిపారు.  ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీరియస్ అయ్యారని చెప్పారు.  ప్రమాదం లో 62 రాయల్ పున్నమి బోట్ లో వెళ్ళుతున్నారు. వారిలో 22 మంది హైదరాబాద్ వచ్చిన వారే.  కాగా 11 మంది వరంగల్ ,మరికొంత మంది విశాఖపట్నం తదితర ప్రాంతాలకు సంబంధించిన వారీగా అధికారులు గుర్తించారు.



ఈ ప్రధామంలో ఇప్పటి వరకు ఏడుగురి మృత దేహాలు లభ్యమయ్యాయి. గోదావరిలో ప్రమాదానికి గురైన బోటు (లాంచీ)కు పర్యాటక శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేవని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. రాయల్‌ వశిష్ట బోటును ప్రయివేట్‌ వ్యక్తి నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కోడిగుడ్ల వెంకట రమణ ఈ బోటును తిప‍్పుతున్నట్లు చెప్పారు. మరోవైపు బాధితులను రక్షించేందుకు పర్యాటక శాఖ హుటాహుటీన రంగంలోకి దిగిందన్నారు. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరి నదిలో పాపికొండల చూడటానికి వెళ్లే పర్యాటక బోటు బోల్తా పడిన ఘటనలో మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం నష్ట పరిహారాన్ని ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయిల చొప్పున పరిహారాన్ని చెల్లిస్తున్నట్టు వెల్లడించారు. మృతుల సంఖ్యను తగ్గించడానికి నౌక దళాన్ని రంగంలోకి దించింది రాష్ట్ర ప్రభుత్వం. నౌకా దళానికి సంబందించిన హెలికాప్టర్ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.




పడవలో మొత్తం 50మంది ఉండగా ఇప్పటికే 11 మంది మృతుల శవాలను వెలికి తీశారు. కాగా మిగితావారికి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాత్రి వేళలో కూడా జాతీయ విపత్తు నిర్వహణ బలగాలు గాలింపు చర్యలు చేపట్టనున్నారు. వర్షం పడే సూచనలు లేకపోవడం వాళ్ళ రాత్రంతా ఈ గాలింపు చెర్యలు చేపడతామని ఎన్డీఆర్ఎఫ్ బలగాలు వెల్లడించారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో పెట్టుకొని మరిన్ని బలగాలను రంగంలోకి దించుతామని పేర్కొన్నారు. చివరి బోటు ప్రమాదంలో తప్పి పోయిన చివరి వ్యక్తి దొరికే వరుకు గాలింపు చర్యలు కొనసాగుతాయని పేర్కొన్నారు. కాగా నది గురించి పూర్తిగా తెలిసిన స్థానిక మత్స్యకారుల సహకారాన్ని కూడా ఎన్డీఆర్ఎఫ్ బలగాలు తీసుకుంటున్నాయి. ఈ విషయంపై హోమ్ మంత్రి సుచరిత స్పందించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: